బాబుపై విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ల పంచ్ లు

340

వైయ‌స్సార్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత‌పై విమ‌ర్శ‌లు చేశారు. యూ – టర్న్‌’ అంకుల్‌ చంద్రబాబు నాయుడు మరో చారిత్రక యూ టర్న్‌కు సిద్ధపడిపోయారంటూ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ – టీడీపీ దోస్తిని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

Image result for chandra babu

చంద్రబాబు కాంగ్రెస్‌కు సరెండర్‌ అయిపోయి, రాహుల్‌ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ ‘యూ-టర్న్‌ అంకుల్‌’ మరో చారత్రక ‘యూ టర్న్‌’కు సిద్ధపడిపోతున్నాడు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్‌ పార్టీలోనే తను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులుదగ్గరలోనే ఉన్నాయి.

Image result for vijayasai reddy

దేశాన్ని రక్షించాలి….ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఎవరంటున్నారు ఈ మాటలు? నాలుగున్నరేళ్ళలో ప్రజాధనాన్ని విచ్చల విడిగా దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి, ప్రజలను నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసిన అరివీర pseudo మీడియా ప్రజాస్వామ్యవాది…చంద్రబాబే!అన్నింటా ఏపీ నం.1. జల హారతులు, బోట్‌ రేసులతో రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్‌కి చేరింది. ప్రపంచపటంలో అమరావతికి సింగపూర్‌ పక్కనే చోటు. సంతృప్తస్థాయి 100% దాటేసింది. ఆనంద ఆంధ్రను చూసి అమెరికా, చైనా, రష్యా కుళ్ళిపోతున్నాయి…చంద్రబాబు ప్రేలాపనలతో ఏం జబ్బో తెలియక డాక్టర్లు బిత్తరపోయారట ఇలా కామెంట్ల‌తో వ‌ర‌స‌గా మూడు ట్వీట్లు చేశారు విజ‌య‌సాయిరెడ్డి.