కోడెల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విజ‌యసాయిరెడ్డి

485

ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు… ఆయ‌న ఓ ఫ్యాక్ష‌నిస్టు అని వ్యాఖ్యానించారు.. ఆయ‌న పై కేసులు ఉన్నాయ‌ని, ఆ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డి ఆయ‌న స్పీక‌ర్ అయ్యారు అని విరుచుకుప‌డ్డారు.. టీడీపీపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం లేదు అని అన్నారు ఆయ‌న‌.. టీడీపీపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం సన్న‌గిల్లింది అని, ఇక టీడీపీని న‌మ్మేప‌రిస్తితి లేదు అని ఆయ‌న విమ‌ర్శించారు. ముఖ్యంగా టీడీపీ చేసే ప‌నులు వారి అవినీతి ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింది అని ఆయ‌న విమ‌ర్శించారు.

Image result for kodela siva prasad

టీడీపీ తో పాటు స్పీక‌ర్ కోడెల పై ఆయ‌న విరుచుకుప్డ‌డారు.. ప్ర‌భుత్వం సోష‌ల్ మీడియాను అణ‌గదొక్కేందుకు చూస్తోంద‌ని, ఇటువంటి ప‌రిస్దితులు ఏ రాష్ట్రంలో లేవ‌ని, కేవ‌లం వైసీపీకి భ‌య‌ప‌డి వారికి సోష‌ల్ మీడియాలో ఉన్న మ‌ద్ద‌తుని చూసి వైసీపీ నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.. చంద్రబాబు 3లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించిన విజయసాయి రెడ్డి. బీజేపీని అంటరానిపార్టీగా చేసి, అవినీతి మరకను తుడుచుకోవాలని చూస్తున్నారని అన్నారు.

Image result for vijaya sai reddy

ఇక తొంద‌ర‌లోనే కాంగ్రెస్ తో బాబు ఎన్నిక‌ల్లో జ‌త‌క‌ట్టి ముందుకు వెళ‌తారు అని అన్నారు.. ఇటువంటి రాజ‌కీయాలు చేస్తున్న చంద్ర‌బాబుని ఎవ‌రు న‌మ్ముతారు అని ఆయ‌న విమ‌ర్శించారు. మొత్తానికి విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు తెలుగుదేశం పార్టీలో ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి అని చెప్పాలి.