బ‌యోపిక్ లో ఈ సీన్ ఉంటుందా విజ‌య‌సాయిరెడ్డి స‌టైర్

363

నంద‌మూరి బాల‌య్య హీరోగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.. ఈ స‌మ‌యంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఓ సంచ‌ల‌న కామెంట్ చేశారు.. వైయ‌స్సార్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ఈ సినిమాలో ఆసీన్ ఉంటుందా లేదా అని ప్ర‌శ్నించారు. ఇంత‌కీ ఆసీన్ ఏమిటి అని అనుకుంటున్నారా.. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఆనాడు ఆయ‌న చేతిలోనుంచి పార్టీని తీసుకున్న వైనం అన్నీ ఉంటాయా అని ప్ర‌శ్నించారు.

Image result for ntr biopic

నారాచంద్ర‌బాబు నాయుడు ఆనాడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన విష‌యం అంద‌రికి తెలిసిందే కదా అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు..ఈ సినిమాలో బాల‌య్య మ‌రి వెన్నుపోటు సీన్ పెడ‌తారా లేదా అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు నాయుడు వంచించిన వైనాన్ని చూపిస్తారా లేదా అని ప్ర‌శ్నించారు. ఇది బాల‌య్య ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారా లేక‌పోతే చ‌రిత్ర‌లో క‌లిసిపోయింది క‌దా అని వ‌దిలేస్తున్నారా.. బావ సీఎంగా ఉన్నారు కాబ‌ట్టి ఈ అంశం చూపించే సాహ‌సం చేయ‌రా అని ప్ర‌శ్నించారు.

Image result for vijaya sai reddy

జ‌గ‌న్ అంటే టీడీపీకి భ‌య‌మ‌ని, అందుకే తెలుగుదేశం భ‌య‌ప‌డుతోంది అని అన్నారు.. జ‌గ‌న్ అంటే టీడీపీ అంతం ఇది వారికి తెలుసు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపొందద‌ని త‌మ విజ‌యం తెలుస్తోంది అని అన్నారు..మొత్తానికి ఆయ‌న ప్ర‌శ్నించిన వెన్నుపోటు ఎపిసోడ్ సినిమాలో ఎలా ఉంటుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు