బాబుకు ట్వీట్ పంచ్ ఇచ్చిన విజ‌య‌సాయిరెడ్డి

268

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడి పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు… అస‌లు ఏపీ రాజ‌కీయాలు చూసుకునే చంద్ర‌బాబు తెలంగాణ రాజ‌కీయాలు ఎందుకు చూస్తున్నారు అని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది… కాంగ్రెస్‌తో చంద్రబాబు మైత్రీబంధంపై ట్విటర్‌లో స్పందించారు.. ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్‌ఎస్‌ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట.. ఇంత ప్రేమ ఎందుకంటే కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే ఓటుకు నోటు కేసు విచారణ స్పీడప్‌ చేసి ఎక్కడ లోపల వేస్తాడోనని చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

Image result for chandra babu

ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు రాహుల్ గాంధీతో పూసుకు తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి అంతకుముందు ఆక్షేపించారు. జాతీయస్థాయి నాయకుడినని ఐటీ శాఖను బెదిరించాలని చూస్తున్నారని విమర్శించారు. చిదంబరం, రాబర్ట్ వాద్రాలే అక్రమ సంపాదన కేసుల్లో ఇరుక్కుని ఉన్నారని, రాహులేం కాపాడతారని ఎద్దేవా చేశారు.. మ‌రి అలాంటి కాంగ్రెస్ పార్టీతో చేతులుక‌లిపి ఇప్పుడు వారి నుంచి కాపాడుకునే ప‌నిలో ఉన్నాడు కాని ఇది జ‌రుగ‌నిది అని విజ‌య‌సాయిరెడ్డి వైసీపీనేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

Image result for vijya sai reddy

‘తిత్లీ తుపాను సాయం స్వాహా చేసే మోసగాళ్లను కఠినంగా శిక్షిస్తాం అంటూ బాబు నిన్న దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడట. సాయాన్ని అక్రమంగా నొక్కేసిన పచ్చ చొక్కా తమ్ముళ్లు పక్కకు తిరిగి ఫక్కున నవ్వారట. బాబు వార్నింగ్‌లు, హూంకరింపులు ఉత్తిత్తివే అన్నది వారికి బాగా తెలుసు కాబట్టి.’ అని విజయసాయి రెడ్డి ట్విటర్‌లో బాబుపై జోకులు పేల్చారు. మ‌రి దీనిపై వైసీపీకి – టీడీపీ ఎటువంటి కౌంట‌ర్ ఇస్తుందో చూడాలి.