ఎంపీ కొత్తపల్లి గీతపై విజ‌య‌సాయిరెడ్డి మ‌రో అస్త్రం

422

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన న‌లుగురు ఎంపీల విష‌యంలో వైసీపీ త‌న దూకుడు మాత్రం వ‌ద‌ల‌డం లేదు.. తాజాగా వీరిపై అనర్హ‌త వేటు వెయ్యాల‌ని వైసీపీ పార్ల‌మెంట్ నేత విజ‌సాయిరెడ్డి స్పీక‌ర్ ను కోరారు.. ఆయ‌న స్పీక‌ర్ కు ఈ విష‌యం పై లేఖ రాశారు….వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అర‌కు ఎంపీ కొల్ల‌ప‌ల్లి గీత లేఖ రాశారని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ నిబంధనల ప్రకారం గీత లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Image result for kothapalli geetha

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ గుర్తుపై అర‌కు నుంచి ఎంపీగా గెలిచార‌ని, పార్టీ మారి తెలుగుదేశంలో చేరార‌ని ఆయ‌న విమ‌ర్శించారు…దీంతో గతంలో కూడా అనేక మార్లు ఆమెపై అనర్హత వేటు వేయాల్సిందిగా తమ పార్టీ డిమాండ్‌ చేసిందని పేర్కొన్నారు… గీతపై వేటు వేయాల్సిందిగా తమ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కోరారని గుర్తుచేశారు.

Image result for vijya sai reddy

కొత్త‌ప‌ల్లి గీత త‌మ పార్టీ అధినేత‌కు లేఖ‌రాశారు కాబ‌ట్టి ఆమె మా పార్టీలో కొన‌సాగ‌డం లేదు అని తెలియ‌చేశారు ఆయ‌న‌… గీతతో పాటు తమ పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎంపీలను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని ఈనెల రెండున తాను కూడా కోరినట్టు గుర్తుచేశారు…ఇక మా పార్టీ అధినేత జ‌గ‌న్ కు ఆమె రాసిన లేఖ‌ను సాక్ష్యంగా తీసుకుని ఆమె పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు ఆయ‌న‌.