బాబుకి హ‌స్తిన‌లో మ‌రో పంచ్ వేసిన సాయిరెడ్డి

279

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న‌పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప‌లు విమ‌ర్శ‌లు ఖండ‌నాలు చేస్తూనే ఉంటారు.. తాజాగా ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో రోజుకో ట్వీట్ తో ప్ర‌శ్న‌ల‌ వ‌ర్షం కురిపిస్తున్నారు.. తాజాగా సీఎం చంద్రబాబు పాల‌న‌పై ఆయ‌న గురించి ఎవ‌రు ఏమి అనుకుంటున్నారు? అనేది ఓ కామెంట్ రూపంలో ట్విట్ట‌ర్లో తెలియ‌చేశారు. మ‌రి ఆ విష‌యం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for CHANDRA BABU

ఆ మధ్య ఢిల్లీలో ఓ తలపండిన రాజకీయ నేత నాతో మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పే బడాయిలు చూస్తుంటే ఏదో ఒక రోజు ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది నేనే, భారత రాజ్యాంగం దగ్గరుండి రాయించింది నేనే అని ప్రకటించినా ఆశ్చర్యపోను అన్నారు. కలికాలం! హతవిధి అంటూ ట్వీట్ పెట్టారు.. ఇక దీనిపై తెలుగుదేశం నేత‌లు మాత్రం రోజుకో అంశం కావాల‌నే సాయిరెడ్డి బాబు పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు అని అంటున్నారు.