బీజేపీని సెంట‌ర్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి

370

ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో బీజేపీ తెలుగుదేశం ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి అని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు.. తెలుగుదేశం ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది అని, అలాగే బీజేపీ ప్ర‌త్యేక హూదా ఇస్తాము అని చెప్పింది అని అన్నారు.. కాని ఇద్ద‌రూ ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు నెర‌వేర్చ‌లేదు అని విమ‌ర్శించారు ఆయ‌న‌.నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా దక్కకపోవడంలో ప్రథమ ముద్దాయి బీజేపీయేనని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు.

Image result for vijay sai reddy

 

ఇక తెలుగుదేశం ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదు అలాగే కేంద్రంతో నాలుగు సంవ‌త్స‌రాలు క‌లిసి ఉండి ఎటువంటి సాయం చేయ‌లేదు అని కేంద్రాన్ని ఒప్పించ‌లేక‌పోయారు అని విమ‌ర్శించారు ఆయ‌న‌. న‌వ్యాంధ్రా క‌ల‌ల రాజ‌ధాని నిర్మాణం చేస్తామ‌ని బీజేపీ తెలుగుదేశం ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌బ‌లికారు అని, ఈ విష‌యంలో బీజేపీ తొలి ముద్దాయి అయితే టీడీపీ రెండో ముద్దాయి అని అన్నారు.. ఇక కాంగ్రెస్ కు కూడా ఈ పాపంలో భాగం ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ మూడ‌వ ముద్దాయి అని విమ‌ర్శించారు ఆయ‌న‌.

Image result for bjp

వైసీపీ నాలుగు సంవ‌త్స‌రాలుగా అనేక విధాలుగా ప్ర‌త్యేక హూదా గ‌ళం విప్పి పోరాడుతోంది అని అన్నారు ఆయ‌న‌…. ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తోంది వైసీపీ అని అన్నారు…..2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి మండలిలో హోదాకు ఆమోదం తెలిపారు…ఆ ఏడాది డిసెంబరు 31 వరకు ప్రణాళికా సంఘం కొనసాగింది. జనవరి 1 నుంచి నీతీ ఆయోగ్‌ వచ్చింది. మరి… మే 26 నుంచి ఏడు నెలల కాలం ఉన్నప్పటికీ ఏపీకి హోదా ఎందుకు ఇవ్వలేదు అని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నిల‌దీశారు.మొత్తానికి బీజేపీతో చీక‌టి ఒప్పందం చేసుకుంది అని వైసీపీ పై విమ‌ర్శ‌లు చేస్తున్న నాయ‌కుల‌కు, విజ‌య‌సాయిరెడ్డి స‌రైన స‌మాధానం ఇచ్చారు అని అంటున్నారు పార్టీ శ్రేణులు.