కేటీఆర్ స‌వాల్ కు ఉత్త‌మ్ రిప్లై

294

తెలంగాణ ఎన్నిక‌ల్లో ఇప్పుడు ప్ర‌చార‌హీట్ పెరిగిపోయింది. ఎన్నిక‌ల దంగ‌ల్ డిసెంబ‌ర్ 7న ఓట‌రు ఎవ‌రిపై ఓటు గుద్దుతాడా అనే అంశం పై రాజ‌కీయ పార్టీలు హోరా హోరి ప్ర‌చారం చేస్తున్నారు.. తాజాగా కేటీఆర్ ఇటీవల కాంగ్రెస్ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు.. త‌మ పార్టీ ఓడిపోతే తాను అమెరికా వెళ్లిపోతా, ఇక్క‌డ ఉండ‌ను అన్నారు…ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఓ సంచ‌ల‌న కామెంట్ చేశారు.

Image result for ktr

రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజాకూటమి ఓడినా, గెలిచినా తనదే బాధ్యత అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. గెలుపు, ఓటములకు తానే కర్తనన్నారు. ప్రజా కూటమి ఓడిపోతే ‘డిసెంబరు 11 తర్వాత నేను గాంధీభవన్‌కు రాను’ అని సంచలన ప్రకటన చేశారు. గాంధీభవన్‌ బాధ్యతలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు చూసుకుంటారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ దళిత ద్రోహి అని విమర్శించారు