నెల‌కి ఓసారి తెలంగాణ‌కు కాంగ్రెస్ యువ‌రాజు ఎందుకంటే ?

391

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య ధుంధుభి మోగిస్తామ‌ని చెబుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ … టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేక‌పోయింది అని, తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ‌లో కొత్త మార్పులు వ‌స్తాయి అని అంటున్నారు టీ-పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి….గత ఎన్నికలకు, ఇప్పటికి వాతావరణం బాగా మారింది అని అంటున్నారు….మైనారిటీలు కూడా మావైపే ఉన్నారు అని చెబుతున్నారు టీ- కాంగ్రెస్ నేత‌లు.

Image result for ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

గ‌తంలో కేసీఆర్ ఏపీకి ఏ స్టేటస్‌ ఇచ్చినా ఇబ్బంది లేదని చెప్పలేదా? ఇప్పుడు ఏపీ విష‌యంలో మెలిక ఎందుకు పెడుతున్నారుఅని కాంగ్రెస్ పార్టీని బ‌ద్నాం చెయ్యాల‌ని మీ ఆలోచ‌న అని కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు…. ఇక తెలంగాణలో టీఆర్ ఎస్ ముఖ్యులు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నారని, ఇప్ప‌టికే టీఆర్ ఎస్ పార్టీలో ముఖ్యులు పలువురు తీవ్ర అసంతృప్తితో కారు పార్టీలో కొన‌సాగుతున్నారు అని ఆయ‌న అన్నారు.

Image result for rahul

రాష్ట్రంలో ప్రతినెలా ఒకరోజు రాహుల్‌ టూర్ తెలంగాణ‌లో ఉంటుంది అని తెలియ‌చేశారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి..పార్టీ టికెట్ల విషయంలో టీఆర్‌ఎ్‌సలో తీవ్రమైన సమస్య ఏర్పడనుందని ఉత్తమ్‌ తెలిపారు ….పార్లమెంటు సమావేశాల తర్వాత హైదరాబాద్‌, రంగారెడ్డి ప్రాంతాల‌కు రాహుల్‌ గాంధీ వ‌స్తార‌ని ఆయ‌న ప‌ర్య‌ట‌న వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలియ‌చేశారు.