ఎన్నికల ఫలితాలపై ఉత్తమ్‌ ఏమన్నారంటే?

257

తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్‌ జరిగినట్లు టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఫలితాలను చూస్తే  టాంపరింగ్‌ చేసినట్లు అర్థం అవుతుందన్నారు. ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎవరెవరూ ఓడిపోతారో టీఆర్‌ఎస్‌ నాయకులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు.  ఫలితాలను ముందే ఎలా చెప్పగలిగారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇవన్నీ టాంపరింగ్‌ను బలపరుస్తున్నాయన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వీవీ ప్యాట్‌ స్లిప్‌లను లెక్కింపు కూడా తప్పక జరపాలన్నారు. ఈ విషయంలో ప్రజా కూటమి అభ్యర్థులు రిటర్న్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని, వీవీప్యాట్‌ లెక్కింపు జరిపే వరకు పట్టుపట్టాలని సూచించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇక కేసీఆర్‌ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ప్రజాకూటమిగా జతకట్టినా.. ఫలితాలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా వచ్చాయి. గట్టి పోటీ ఉందని అందరూ భావించిన వార్‌ వన్‌సైడ్‌ అయ్యింది. కేసీఆర్‌కు ప్రజలు మరోసారి పట్టం కట్టారు.