కోడెల ఆత్మ‌హ‌త్యకు ముందు ఫోన్ లో వీడియో రికార్డ్ చేశారా

232

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో పోస్ట్‌మార్టం కీలకంగా మారనుంది. అయితే ముఖ్యమైన ఆయ‌న మొబైల్‌ మిస్‌ అయ్యింది. సోమవారం సాయంత్రం నుంచి కోడెల మొబైల్ క‌నిపించ‌డం లేదు. ఇదే విష‌యాన్నిపోలీసులు చెప్తున్నారు. అయితే కోడెల వెంట నిత్యం ఫోన్ ఉంటుంది, అలాంటిది ఆయ‌న రూమ్ లో ఫోన్ క‌నిపించ‌క‌పోవ‌డం ఏమిటి అనేది ఇప్పుడు పెద్ద మిస్ట‌రీగా మారింది.ఈ విష‌యాల‌న్నింటిపై కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడ‌నున్నారు పోలీసులు… రెండు రోజుల్లో ఆయన కుమారుడ్ని విచారణ చేయనున్నారు పోలీసులు. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. దీంతో హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌ భాద్యతలు బంజారాహిల్స్ ఏసీపీకి అప్పగించారు. ఏసీపీ కేఎస్ రావు విచారణ వేగవంతం చేశారు.

Image result for kodela siva prasad

కోడెల కూతురు విజయలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆయ‌న ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలు, అపోహలు రావడంతో కేసును టెక్నికల్ గా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న రూమ్ ను రెండు గంటలు పాటు పరిశీలించి క్లూస్ ను సేకరించారు. అయితే కేసులో ఎంతో కీలక ఆధారమైన వ్యక్తిగత మొబైల్ మిస్ కావ‌డం పై పోలీసులు కూలంకుషంగా విచార‌ణ చేస్తున్నారు. సోమవారం కోడెల కుటుంబసభ్యులు విషాదంలో ఉండడంతో పోలీసులు ఆయన మొబైల్‌ని సేకరించలేదు. ఆ తర్వాత మొబైల్‌ తీసుకోవాలని పోలీసులు భావించగా స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. మొబైల్‌పై కుటుంబసభ్యులను విచారిస్తే తమకు తెలియదంటూ సమాధానమిచ్చారు. కోడెల కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. సోమవారం ఉదయం 8.30 నిమిషాలకు కోడెల మొబైల్ నుండి కాల్ వెళ్ళినట్లు గుర్తించారు. ఆ చివరి కాల్ 24 నిమిషాలు పాటు మాట్లాడినట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యకు ముందు రెండు రోజులు కాల్ డేటాను బంజారాహిల్స్ పోలీసులు పరిశీలిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత ఆయన కుమారుడు శివరాంను కూడా పోలీసులు విచారించనున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

కోడెల చివ‌రి రోజు ఎనిమిది ఫోన్ కాల్స్ మాట్లాడారు అని తెలుస్తోంది. ఈ ఎనిమిది కాల్స్ ఎవ‌రితో మాట్లాడారు అని విచార‌ణ చేస్తున్నారు ..చివ‌ర‌గా 24 నిమిషాల కాల్ మాట్లాడి ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.. 12 రోజులుగా ఆయ‌న హైద‌రాబాద్ లో ఉన్నారు, కేవ‌లం కుటుంబ సభ్యుల‌తోనే ఆయ‌న ఉన్నారు అని తెలుస్తోంది. ఇక విదేశాల్లో ఉన్న శివ‌రాంతో కోడెల అనేక‌సార్లు ఫోన్లో మాట్లాడారు అని కూడా విచార‌ణలో తెలుసుకున్నారు. ఇక ఆయ‌న‌పై ఉన్న కేసుల విష‌యంలో అడ్వ‌కేట్ల‌తో కూడా కోడెల మాట్లాడారు వాటిని కుమారుడితో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది, అయితే ఆయ‌న ఆత్మ‌హత్య‌కు ముందు రూమ్ కు సెల్ ఫోన్ తీసుకువెళ్లారంటున్నారు, మ‌రో కోణంలో కూడా ఆలోచ‌న జ‌రుగుతోంది ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకునేముందు వీడియో ఏమైనా తీసి రికార్డ్ చేసి మొబైల్ లో సేవ్ చేశారా అనేది కూడా విచార‌ణ చేస్తున్నారు.. క‌చ్చితంగా వీడియో రికార్డ్ చేసే అవ‌కాశం ఉంది అని పోలీసులు బావిస్తున్నారు…ఎందుకు అంటే సూసైడ్ నోట్ లేదు కాబ‌ట్టి వీడియో ఉంటుంద‌ని, అందుకే పోలీసులు మొబైల్ ఫోన్ కోసం విచార‌ణ చేస్తున్నారు.