జగన్ ముఖ్యమంత్రి అయితే ఆప‌ని చేస్తా ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్

441

ఆయ‌న వైయ‌స్ కు ఆప్త మిత్రుడు… వైయ‌స్ శిష్యుడిగా రాజ‌కీయాల్లోకి వైయ‌స్ వెంట న‌డిచిన వ్య‌క్తి… రాజ‌మండ్రి ఎంపీగా చేసి ప‌లువురి మ‌న్న‌న‌లు పొంది సీనియ‌ర్ నేత‌గా పేరు తెచ్చుకున్న నేత మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్.. ఇక ఆయ‌న వైయ‌స్ ఫ్యామిలీ పై ఉన్న ప్రేమ‌ను జ‌గ‌న్ పై కూడా చూపిస్తూ ఉంటారు.. ఆయ‌న‌కు స‌పోర్ట్ చేస్తూనే ఉంటారు.. ఇటు తెలుగుదేశం అధినేతను క‌లిసినా, ప‌వ‌న్ ని క‌లిసినా జ‌గ‌న్ ని క‌లిసిన స‌మ‌యంలో మాట్లాడే అంత చ‌నువు రాజ‌కీయంగా ఇక ఎవ‌రితో లేదు అని అంటారు ఆయ‌న‌.Image result for jagan padayatra

ఇక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు సంచ‌ల‌న కామెంట్లు చేశారు… వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే, తనకు తెలిసిన వారే మంత్రులుగా ఉంటారని, ఏదైనా పని చేయించుకోవాల్సి వస్తే, వారి వద్దకు డైరెక్టుగా వెళ్లే అవకాశం లభిస్తుందని, అదే ఇంకోసారి చంద్రబాబు వస్తే, రహస్యంగా మంత్రులతో మాట్లాడి పని చేయించుకోవాల్సి వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేసారు. నేరుగా స‌చివాల‌యానికి వెళ‌తా ఏ మంత్రిద‌గ్గ‌రా ముందు అపాయింట్ మెంట్ తీసుకునే అవ‌స‌రం నాకు ఉండ‌దు అనినేను భావిస్తున్నా, దానికి కార‌ణం వారంద‌రూ నాకు తెలిసిన వారు కావ‌డం అని అన్నారు.. ఇది క‌రెక్ట్ పాయింటే అందరూ కాంగ్రెస్ మూలాలు క‌లిగిన నాయకులే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు.Image result for jagan padayatraఇక్క‌డ మ‌రో కీలక విష‌యం తెలియ‌చేశారు ఆయ‌న‌.. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయితే, ఆయనకూ తాను క్రిటిక్ గా మారే అవకాశాలు రావచ్చని చెప్పారు. ఉండ‌వ‌ల్లి రాజ‌కీయంగా మేధావి ఆయ‌న మాట్లాడే విధానం ఓ పాయింట్ తీసుకుని ఏదైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడే త‌త్వం క‌లిగిన నాయ‌కుడు.. అందుకే ఆయ‌న్ని అన్నీ పార్టీల్లో నాయ‌కులు అభిమానిస్తారు.. స్నేహ‌పూరితంగా ఉంటారు.. ఇక పార్టీల ప‌రంగా విభేదాలు ఉన్నా సీఎం కూడా ఆయ‌న్ని గ‌తంలో స‌చివాల‌యానికి పిలిచి మాట్లాడిన విష‌యం తెలిసిందే.