బాబుకు ఉండ‌వ‌ల్లి కౌంట‌ర్

402

తెలుగుదేశం అధినేత‌పై మ‌రోసారి రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు… వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం సీఎం చంద్ర‌బాబు కొత్త రాజ‌కీయాలు చేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు..ప్రత్యేక హోదాపై చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇప్పుడు ఆయ‌న తెలియ‌చేశారు.. గ‌తంలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌తో అన్నారు, ప్ర‌త్యేక హూదా వ‌ల్ల ఏం లాభం అని, కాని ఇప్పుడు ప్ర‌త్యేక హూదా కావాలి అని కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.. ఆ నాడు ప్ర‌త్యేక ప్యాకేజీని స్వాగ‌తించారు.. నాలుగు సంవ‌త్స‌రాలు ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు ఇప్పుడు కొత్త‌గా ప్ర‌త్యేక హూదా అని అంటున్నారు.

Image result for undavalli arun kumar

ఇదంతా ఎన్నిక‌ల‌కు మ‌రో సంవ‌త్స‌రం మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో చేస్తున్న ప‌ని అని ఆయ‌న అన్నారు… ఇలా ప్ర‌త్యేక రాగంతీస్తే మ‌రోసారి ఎన్నిక‌ల్లో గెల‌వ‌చ్చు అని చేస్తున్న ప్ర‌య‌త్నం అని ఆయ‌న అన్నారు.. ఇక తాను పార్టీ మారుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. అందులో వాస్త‌వం లేదు, నేను ప్ర‌స్తుతం ఏ పార్టీలో లేను అని అన్నారు ఉండవ‌ల్లి… భ‌విష్య‌త్తులో కూడా ఏ రాజ‌కీయ పార్టీలో చేరేది లేదు అని అన్నారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్.

Related image

ఏపీ విభజన తప్పుకాదని.. జరిగిన తీరు రాజ్యాంగ విరుద్దమని, నిబంధనలకు విరుద్దంగా బిల్లు పాస్‌ చేశారని వ్యాఖ్యానించారు… ఇప్పుడు చంద్రబాబు కంటే ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే ప్రజాదరణ ఎక్కువగా ఉందని అన్నారు… 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని అందరూ భావించారని.. కానీ ఎన్నికల మేనేజ్మెంట్లో దిట్ట అయిన చంద్రబాబు రాజకీయ సమీకరణాలు మార్చేశార‌ని ఆయ‌న అన్నారు. ఇక జ‌న‌సేన కూడా ప్ర‌జల్లో వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తోంది.. ప‌వ‌న్ ఉత్త‌రాంధ్రా నుంచి గోదావ‌రి జిల్లాల్లోకి వ‌చ్చారు.. ఇప్పుడు ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తే ఆయ‌నకు ప్ర‌జ‌ల్లో ఎలా వేవ్స్ ఉన్నాయో తెలుస్తాయి అని అన్నారు ఆయ‌న‌.