ఉండ‌వ‌ల్లి బాబుకు సూటి ప్ర‌శ్న‌లు ఇదేమి కొత్త వ్యాపారం?

343

సీఎం చంద్ర‌బాబునాయుడు అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మిస్తున్నారా లేదా, మ‌రేదైనా వ్యాపారం చేస్తున్నారా అని ప్ర‌శ్నించారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్… ఇక అమ‌రావ‌తి బాండ్ల విష‌యం ఎవ‌రికి తెలియ‌డం లేద‌ని, దీనిపై అధిక వ‌డ్డీ ఇవ్వాల్సిన లోగుట్టు ఏమిటో అర్ధం కావ‌డం లేదు అని ఆయ‌న ప్ర‌శ్నించారు… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమరావతి బాండ్లున్నాయన్నారు. హడ్కో తక్కువ వడ్డీకి రుణం ఇస్తున్నా ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. సీఆర్డీఏను కంపెనీగా మార్చేసి అప్పులు తెచ్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

Image result for chandrababu and undavalli

ఇక ఈ అమ‌రావ‌తి బాండ్ల విష‌యంలో ప్ర‌జ‌ల‌కు అనేక అనుమానాలు ఉన్నాయి అని ఆయ‌న ప్ర‌శ్న‌లేవ‌నెత్తారు… గవర్నర్‌ పాలనలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పు తీసుకుందన్నారు. అమరావతి బాండ్లు, పోలవరం, పట్టిసీమతో సహా రాష్ట్రంలో జరిగిన పంపింగ్‌ స్కీమ్స్‌‌, బలహీన వర్గాల కోసం నిర్మిస్తున్న ఇళ్లు, సీఎం చెప్పిన 18 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు అనే ఆరు అంశాలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు తనతో చర్చకు సిద్దమా అని సవాల్‌ విసిరారు.

Image result for chandrababu and undavalli

 

తాను ఇప్ప‌టి వ‌ర‌కూ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబితే తాను అక్క‌డే క్ష‌మాప‌ణ‌లు చెప్పి మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కూ మాట్లాడ‌ను అని అన్నారు.. చ‌ద‌ర‌పు గ‌జానికి రూ.1500లతో నిర్మిస్తున్న ఇళ్లను ప్రభుత్వం మూడువేలకు కట్టబెడుతుందన్నారు. ఇక సీఎం చెప్పిన 18 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు.

Image result for chandrababu and undavalli

ఇక ఇక్క‌డ అసెంబ్లీలో ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి అని చంద్ర‌బాబు అంటారు.. అక్క‌డ రాజ్య‌స‌భ‌లో సుజ‌నాచౌద‌రి మాత్రం ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు రాలేదు అంటారు.. ఈ స్టేట్ మెంట్లు ఏమిటి అని ప్ర‌శ్నించారు? ఇక హెరిటేజ్ లాభాలు బాగానే ఉన్నాయి కాని ఈ మూడు సంవ‌త్స‌రాల్లో ఎన్ని పాల‌డైరీలు మూసుకుపోయాయో కూడా లెక్క తెలుస్తోంది అని అన్నారు ఆయ‌న‌. మొత్తానికి దీనిపై టీడీపీ నాయ‌కులు ఎటువంటి స్పంద‌న స్పందిస్తారో చూడాలి.