మ‌రోసారి బాబు పై విమ‌ర్శ‌ల బాణాలు వ‌దిలిన ఉండ‌వ‌ల్లి

400

రాజ‌మండ్రి కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్, మ‌రో సారి తెలుగుదేశం ప్ర‌భుత్వం పై తూర్పార‌పెట్టారు.. ఓవారం రోజులు మందుబాబులు స్ట్రైక్ చేస్తే క‌చ్చితంగా ప్ర‌భుత్వాలు అల్లాడిపోతామ‌ని, ప్ర‌భుత్వాల‌కు ఈ విష‌యం తెలుసు అని ఆయ‌న అన్నారు. ఎనిమిది రూపాయ‌ల‌కు త‌యారు అయ్యే మ‌ద్యం, 50 రూపాయ‌లకు అమ్ముతున్నార‌ని .దీంట్లో 37 రూపాయ‌లు ప్ర‌భుత్వం దోచుకుంటోంది అని ఆయ‌న అన్నారు.. ఇలా జ‌రుగుతున్న అన్యాయం పై త‌న‌ని చాలా మంది సంప్ర‌దిస్తున్నారు అని ఆయ‌న తెలియ‌చేశారు.

Image result for chandra babu
ఇలాంటి దారుణాలు చూసి ఉద్యోగాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌స్తామ‌ని అంటున్నారు అని అన్నారు. అస‌లు అమ‌రావ‌తి బాండ్ల విష‌యంలో కూడా స‌రైన విధానం లేద‌ని, బాండ్ల వ‌డ్డీరేట్ల గురించి కూడా ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది అని, అసలు ట్యాక్స్ ఎంతో తెలియ‌కుండా బాండ్లు ఎలా జారీ చేస్తారు అని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు.. ధ‌న‌వంతులు మ‌రింత ధ‌న‌వంతులు అవుతునన్నారు, ఈ ధ‌న‌వంతులు పేద‌ల మ‌ధ్య వ్య‌త్యాసం త‌గ్గించాలి అని ఆయ‌న అన్నారు.

Image result for chandra babu

దేశంలో ఎక్కడాలేని వడ్డీలు ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు. జలయజ్ఞంలో ఇచ్చిన కేటాయింపులు ఏంటని ప్రశ్నించారు. నాలుగేళ్లలో లక్షా 30 వేల కోట్లు అప్పు చేశారని, ఇంత అప్పు చేసి దేనికి ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.. సీఎం చంద్రబాబు నిజం చెప్పి పాలన చేయగలరా అని ప్రశ్నించారు.. చంద్రబాబు చేస్తున్న వ్యాపారాన్ని స్విట్జర్లాండ్‌ ఆర్థికవేత్త వ్యతిరేకించారని, ఆయన లెక్కలు చెబితే జైళ్లో పెడతారని చెప్పినట్లు ఉండవల్లి పేర్కొన్నారు. ఇలా బాబు ప‌రిపాల‌న పై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్టారు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్