ఆనాడు వైయ‌స్ అలా నేడు వివేకా ఇలా న‌మ్మ‌లేని నిజాలు

329

ప్ర‌జ‌ల హితం కోరేవాడు జననేత అవుతాడు. మహానేతగా నీరాజనాలు అందుకుంటాడు. జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు. అలాంటి నాయకుడే వైఎస్‌ రాజశేఖర రెడ్డి. జనం గుండెల్లో ఆయనది చెరగని స్థానం. రాజన్న అంటే ఒక ఆత్మీయ పలకరింపు. అంతకుమించి ఓ పెద్ద దిక్కు. అలాంటి మహానేత అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీరని శోకంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు (సెప్టెంబర్ 2-2009)న ఆయ‌న మ‌ర‌ణం కోలుకోలేని విషాదం ఆంధ్రాలో జ‌నాల‌ని శోక‌సంద్రంలో మునిగిపోయేలా చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

బడుగు ఇంటి తలుపు తడితే గూడునిచ్చిన (ఇందిరమ్మ ఇళ్లు) జననేతను గుర్తు చేసుకుంటూ కంటతడి పెడుతుంది. పింఛనుతో ఆకలి తీర్చుకుంటున్న పండుటాకు ప్రతి అన్నం మెతుకులోనూ రాజన్ననే చూసుకుంటుంది. ఫీజు రాయితీతో ఎదిగిన ప్రతి సరస్వతీ పుత్రుడు నీ రుణం తీర్చుకోలేమంటూ చేతులు జోడిస్తాడు కృత‌జ్ఞ‌తతో. ఇక ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందిన నిరుపేదలైతే ఆ ఆత్మీయ నేతను నిత్యం దేవుడిలా కొలుస్తారు. జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగించినప్పుడే రైతుల కష్టాలను చూసి చలించిపోయారు వైఎస్. అన్నదాతల కడగళ్లు తుడవడానికి సాగునీటి కోసం జలయజ్ఞం ప్రారంభించారు. అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను అండగా నిలిచారు.

Image result for ysr

అది 2009 సెప్టెంబర్ 2.. ఆ సమయంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా ప్రజల బాధలు తెలుసుకోవడానికి బయలుదేరారు వైఎస్. వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు వారిస్తున్నా.. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 9.35 గంటలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయి. ఆయన ఆచూకీ కోసం గాలింపు మొదలైంది. గంటలు గడుస్తున్నకొద్దీ తెలుగోడి గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. 12 గంటల తర్వాత ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెప్పారు. దీంతో ఆందోళన తీవ్రమైంది.

Image result for ys vivekananda reddy dead body

25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. ప్రమాదస్థలం రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు – వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో మరో 16 కిలోమీటర్లు దూరంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతం ఉంది. నాటి ప్రమాదంలో వైఎస్‌తో పాటు మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నేత మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వంద‌లమంది గుండెలు ఆగిపోయాయి. ఆనాడు అన్న అలా తిరిగిరాని లోకాల‌కు వెళ్లారు, నేడు సోద‌రుడు కూడా తిరిగిరాని లోకాల‌కు త‌ర‌లిపోయారు.

Image result for ys vivekananda reddy dead body

ఈరోజు ఉద‌య‌వ వైయ‌స్ వివేకా అనుమానాస్ప‌ద మృతిలో మ‌ర‌ణించారు ఏపీలో ఎన్నిక‌ల వేళ ఆయ‌న మ‌ర‌ణం షాక్ కు గురిచేసింది వైసీపీ శ్రేణులు క‌న్నీటిప‌ర్యంతం అయ్యారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైఎస్ వివేకాకు ఒక కుమార్తె ఉంది. వైఎస్ వివేకా ఆగస్ట్ 8, 1950న ఆయన జన్మించారు. వైఎస్ వివేకానందరెడ్డి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన గతంలో కడప లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేశారు. పులివెందుల నుంచి 1989, 1994లో వైఎస్ వివేకా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Image result for ysr

వైఎస్ మరణానంతరం ఏర్పడిన కిరణ్ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం విభేదాలకు స్వస్తి పలికి కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తరపున ఆయన పులివెందులలో నిన్న ప్రచారం కూడా చేశారు. ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని మార్చి 3వ తేదీన వైఎస్ వివేకా పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆయన హఠాన్మరణంతో జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. వైయ‌స్ ఆర్ ఆనాడు ఇలా ప్ర‌జ‌లద‌గ్గ‌ర‌కు వెళుతూ దూరం అయ్యారు, నేడు వైయ‌స్ వివేకా కూడా ఎన్నిక‌ల వేళ ప్ర‌జ‌ల‌కు దూరం అయ్యారు,