రాజీనామా చేస్తా వైసీపీ ఎమ్మెల్యే ?

393

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తూర్పుగోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే.. ఇక తునిలో ఆయ‌న స‌భ ఎంత స‌క్సెస్ అయిందో యావ‌త్ ఏపీ చూసింది.. ఆయ‌న‌కు పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు తెలిపారు.. ఇక అడుగ‌డుగునా ఆయ‌న‌కు నీరాజ‌నాలు ప‌లికారు. ఇక తాజాగా తుని ప‌ట్ట‌ణంలో అభివృద్ది జ‌రుగ‌డం లేదు అని వైసీపీ ఎమ్మెల్యే దాటిశెట్టి రాజా విమ‌ర్శ‌లు చేశారు.. అధికార పార్టీ కావాల‌నే ఇక్క‌డ అభివృద్దికి తిలోద‌ల‌కాలు వ‌దిలింది అని ఆయ‌న విమ‌ర్శలు చేశారు.

Image result for jagan

ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలో ఫిరాయింపుల ఎఫెక్ట్ తో వైసీపీ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే నిలుపుకోగ‌లిగింది.. ఇక తాజాగా వైసీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధికార పార్టీ పై విమ‌ర్శ‌లు చేశారు…. అధికార పార్టీ తుని అభివృద్దికి 70 కోట్ల రూపాయ‌లు కేటాయించాము అని చెబుతున్నారు.. ప్ర‌భుత్వం క‌నీసం 5 కోట్లు కూడా ఖర్చు చేయ‌లేదు అని విమ‌ర్శించారు ఆయ‌న‌.. ఇప్పుడు 70 కోట్ల రూపాయ‌ల ప‌నులు చేశాము అని చెబుతున్న మీరు ఒక్క అభివృద్ది ప‌ని చూపించినా నా ప‌ద‌వికి రాజీనామా చేస్తాను అని స‌వాల్ విసిరారు ఆయ‌న‌. వ‌ర్షం వ‌స్తే నీరు వెళ్ల‌క ప‌ట్ట‌ణం మునిగిపోయేలా ఉంద‌ని.

కాని అభివృద్దిలో ప‌రుగులు పెడుతోంద‌ని చెబుతున్న టీడీపీ నాయ‌కులు ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాలి అని అన్నారు ఆయ‌న‌. ప్ర‌తిప‌క్ష పార్టీ ఇక్క‌డ అధికారంలో ఉంద‌ని, అభివృద్ది ప‌నుల‌కు నిధుల విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విష‌యంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. తాజాగా రాజా కూడా ఇదే కామెంట్లు చేయ‌డంతో, ఇది నిజ‌మే అని న‌మ్మ‌క త‌ప్ప‌డం లేదు అంటున్నారు.