రేవంత్ కు కాంగ్రెస్ సంఘీభావం కేసీఆర్ దిష్టిబొమ్మ ద‌గ్దం

316

తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీటు క‌నిపిస్తోంది.. ఈ స‌మ‌యంలో కేంద్ర విచార‌ణ సంస్ద‌లు తెలంగాణ‌లో అన్ని పార్టీల నాయ‌కుల‌పై ఫోక‌స్ పెట్టాయి అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి..ఇప్ప‌టికే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల‌పై త‌మ విచ‌క్ష‌ణ అధికారాల‌తో వారి ఇళ్ల‌ల్లో సోదాలు జ‌రుపుతున్నాయి అయితే కొన్ని కేసుల్లో ప‌లు కీల‌క విష‌యిలు తెలుసుకుంటున్నాయి అని అంటున్నారు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి పై ఐటీ దాడులు జ‌రుగ‌డం పై, ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు నేత‌లు ఆందోళ‌న చెందారు కావాల‌నే ఆరోప‌ణలు విమ‌ర్శ‌లు చేయ‌డం నుంచి కొత్త పందాలో రాజ‌కీయం చేస్తున్నారు అని విమ‌ర్శిస్తున్నారు… టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డితో సహా పలువురు నాయకులు సంఘీభావంగా రేవంత్‌ ఇంటికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేసీఆర్‌ దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్‌ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది.

కావాల‌నే రేవంత్ ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేక ఇలాంటి ప‌నులు చేస్తున్నారు అని విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు .. ఇక ఆయ‌న ఇంటిపై అధికారుల‌తో దాడులు చేయించి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా వేధిస్తున్నారు అని మండిప‌డ్డారు. మొన్న జగ్గారెడ్డిపై కేసు, నేడు రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు ఇవన్నీ టీఆర్‌ఎస్‌ చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు.. కేసీఆర్ కు ఓట‌మి భ‌యంప‌ట్టుకుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ నీ నాయ‌కుల‌ను ఇలా ఇబ్బందులు పెడుతున్నారు అని విమ‌ర్శించారు. ఇలాంటి దాడుల‌ను జానారెడ్డి ఖండించారు. నాయకుల‌ను భ‌య‌పెట్ట‌డానికే ఇలాంటి చ‌ర్య‌ల‌కు కేసీఆర్ పాల్ప‌డుతున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.