జగన్ పార్టీలో చేరిన ప్రముఖ హీరో..!

490

ప్రస్తుతం సినీ గ్లామర్ తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి..కానీ ప్రతిపక్ష నాయకుడు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర తో ఇతర పార్టీల నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆకర్షితులవుతున్నారు..2019 ఎన్నికల సమయం నాటికీ చాలామంది సినీ ప్రముఖులు వైసీపీ పార్టీ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ఇప్పటికే నటులు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ , సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడులు జగన్‌ కు తమ మద్దతు తెలుపగా.. తాజాగా ప్రముఖ నటుడు కృష్ణుడు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. జననేత వైఎస్‌ జగన్‌ పాదయాత‍్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు.