టీడీపీలోకి ముగ్గురు సీనియ‌ర్ నేత‌లు

349

తెలుగుదేశం పార్టీలోకి ఓ ముగ్గురు నాయ‌కులు చేరే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది. ముఖ్యంగా వారు ముగ్గురూ కూడా వైసీపీలోకి వెళ‌తారు అని అనుకున్నా, చివ‌రి నిమిషంలో వైసీపీని కాదు అని తెలుగుదేశంలో చేరుతారు అని తెలుస్తోంది. ఇక వారుఉత్త‌రాంధ్రాలో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లుగా పేరు తెచ్చుకున్నారు అందుకే వారికి ఏ పార్టీ అయినా అవ‌కాశం ఇస్తుంది అని అంటున్నారు.

Image result for స‌బ్బంహ‌రి

ముందుగా స‌బ్బంహ‌రి
దాడి వీర‌భ‌ద్ర‌రావు
కొణ‌తాల రామ‌కృష్ణ

Image result for దాడి వీర‌భ‌ద్ర‌రావు

వీరి ముగ్గురు ఉత్త‌రాంధ్రాలో రాజ‌కీయంగా మ‌హామేటి నాయ‌కులు అనే చెప్పాలి.. ముగ్గురు జ‌గ‌న్ ని చంద్రబాబుని మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ద‌గ్గ‌ర నుంచి చూశారు.. పార్టీల్లో క‌లిసి ప‌నిచేశారు, బ‌య‌టకు వ‌చ్చారు. ఇప్పుడు ఏ రాజ‌కీయ పార్టీలో వీరు లేరు. అందుకే వీరిని పార్టీలో చేర్చుకోవాలి అని వైసీపీ తెలుగుదేశం ప్ర‌యత్నిస్తున్నాయి.

Image result for కొణ‌తాల రామ‌కృష్ణ

అయితే ఈ స‌మ‌యంలో స‌బ్బం హ‌రి ఈ నెల 15 లోపు తెలుగుదేశంలో చేరుతారు అని అంటున్నారు..ఇటు కొణ‌తాల కూడ అన‌కాప‌ల్లి సీటు పై స్ప‌ష్టత ఇస్తే ఎంపీగా పోటీ చేయ‌డానికి తాను సిద్దంగా ఉన్నాను అని తెలుగుదేశంలోకి ఎంట్రీ ఇస్తాను అని అంటున్నారట‌. మరి స‌బ్బం హ‌రి కూడా అదే సీటు పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఇద్దిరిలో ఎవ‌రికి అనేది ఇప్పుడు ఆలోచ‌న. ఇక దాడి జ‌న‌సేన‌లోకి కాకుండా తెలుగుదేశంలోకి వ‌స్తే ఆయ‌న‌కు అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది అని అంటున్నారు..