కోడెల మరణం కేసులో ఏ1 ఏ2 ఏ3 ఎవ‌రో తెలిస్తే షాక్

1320

కోడెల శివ‌ప్ర‌సాద్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్య‌క్తి…ప‌ల్నాడులో తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడు ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీలో చేరిన త‌ర్వాత స‌న్నిహితుడిగా పార్టీలో ఎదిగిన వ్య‌క్తి , అలాంటి నాయ‌కుడు ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.. అవ‌స‌రానికి వాడుకున్న చంద్ర‌బాబు చివ‌ర‌కు కోడెల‌ను వ‌దిలేశారు అని విమ‌ర్శిస్తున్నారు.కష్టకాలంలో చంద్ర‌బాబు వదిలేసి వెళ్లిపోయాడు అనే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు కోడెల అభిమానులు.. అవమానాల భారంతో ఆయన తనువు చాలించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఆయన చ‌నిపోయిన త‌ర్వాత.. అదే డెడ్ బాడీతో శవ రాజకీయం చేయడంపై కోడెల సన్నిహిత వర్గాలు రగిలిపోతున్నాయట.. ఈ విషయం ఆ నోటా ఈనోట బయటకు రావడంతో టీడీపీ కోడెలకు చేసిన నమ్మకద్రోహం ఇదేనంటూ ప్రచారం సాగుతోంది.

Image result for chandra babu

కోడెల శివప్రసాద్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇదే చంద్రబాబు ఆయనను నెత్తిన పెట్టుకున్నాడు. పల్నాటి పులి అంటూ కొనియాడారు. కానీ 2014లో 6వ సారి గెలిచాక మాత్రం ఈయనకు క్లిష్టమైన స్పీకర్ పదవిని అప్పజెప్పాడు. సరే బాబు అండగా ఉంటాడని ఈయన ప్రతిపక్షాన్ని అణిచివేశాడు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగినా సస్పెండ్ చేయకుండా చంద్రబాబు చేతిలో కోడెల రిమోట్ అయ్యాడన్న అపవాదు ఆయనకు వచ్చింది. చంద్రబాబు కోసం నీతి – నియమాలు అన్నీ పక్కనపెట్టి బలిపశువు అయ్యాడన్న ఆవేదన కోడెల సన్నిహితుల్లో ఉంది. ఇప్పుడు గెలిచిన వైసీపీకి కోడెల టార్గెట్ కావడానికి ఆయన స్పీకర్ గా తీసుకున్న నిర్ణయాలు – నిర్బంధం అంటున్నారు ఆయ‌న సన్నిహితులు… వైసీపీని టార్గెట్ చేయడమేనన్న ఆవేదన ఆయన సన్నిహితులు – క్యాడర్ లో ఉందట.. ఇలా చంద్రబాబు చెప్పినట్టు రాజీనామాలు ఆమోదించకుండా.. వైసీపీపై అసెంబ్లీలో ఉక్కుపాదం మోపడానికి కోడెల పడిన బాధ – ఆవేదన ఒత్తిడి అంతా ఇంతాకాదని ఆయన మనసు ఎరిగిన వారు చెబుతుంటారు.

ఈ క్రింద వీడియో చూడండి

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక చంద్రబాబు అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. ఆయన ఫ్యామిలీపై కేట్యాక్స్ కేసులు నమోదై ఇబ్బందులు ఎదురవుతున్నా కోడెలకు సపోర్టుగా ఒక్కరోజు కూడా చంద్రబాబు మాట్లాడింది లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కోడెలకు అండగా నిలిస్తే తనకు ఆ కేసులు చుట్టుకుంటాయని.. ఆయనను చంద్రబాబు దూరం పెట్టారన్న విమర్శలున్నాయి… ఇక కోడెల కుటుంబం నిర్వహిస్తున్న షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్ బయటపడ్డప్పుడు దొంగ అంటూ ముద్ర వేసి కోడెలను మానసిక క్షోభకు గురిచేశారు. ఆ సమయంలోనూ చంద్రబాబు కోడెలకు అండగా నిలిచింది లేదు.. ఆత్మస్థైర్యం ఇచ్చింది లేదు.చంద్రబాబు కనుక కోడెలకు అండగా నిలిచి ఆయన తరుఫునా పోరాడినా.. మద్దతుగా నిలబడినా ఇప్పుడు కోడెల బతికే ఉండేవాడన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.. కోడెల స్పీకర్ గా ఉన్నప్పుడు నర్సారావుపేట కేంద్రంగా కేట్యాక్స్ పేరిట ఆయన కుమారుడు శివరాం వసూలు చేసిన డబ్బులు కూడా కోడెల మెడకు చుట్టుకున్నాయి.

Image result for kodela son

వైసీపీ ప్రభుత్వం వచ్చాక బాధితులంతా బయటకు రావడంతో ఫ్యామిలీ కేసుల్లో ఇరుక్కుంది.ఇక ముచ్చటగా కోడెల చావుకు ఆయన కూతురు కూడా ఓ కారణమని ప్రచారం జరుగుతోంది. కేట్యాక్స్ దందాలో కూతురుపై కూడా కొన్ని చోట్ల ఆరోపణలు వచ్చాయి. ఇక బైక్ షోరూంల బిజినెస్ లో తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోడెల కూతురు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఏకంగా అసెంబ్లీ ఫర్నిచర్ ను తన షోరూంలో వాడుకోవడం దుమారం రేపింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఫర్నీచర్ వివాదంలో కోడెల దొంగగా అభాసుపాలు కావడానికి ఆయన కూతురు కూడా ఒక కారణం అన్న విమర్శలున్నాయి.చంద్రబాబు – కోడెల కుమారుడు – కూతురు ఆయన ఆత్మహత్యకు పరోక్ష కారణమన్న ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్యపై గనుక కేసులు నమోదు చేస్తే చంద్రబాబు ఏ1 గా – కోడెల కుమారుడు శివరాం ఏ2గా – కూతురు ఏ3గా ఉంటారని కోడెల సన్నిహితులు తెలియ‌చేస్తున్నారు. అస‌లు ప్ర‌భుత్వం పై ఇలా విమ‌ర్శ‌లు చేయ‌డం నీచ‌మ‌ని అంటున్నారు కోడెల స‌న్నిహితులు. మ‌రి ప్రభుత్వం వ‌ర్ష‌న్ అలాగే ప్ర‌తిప‌క్షం ఓపీనియ‌న్ విన్నారుగా మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.