జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఈ ప‌దం ఇక వాడ‌రు

478

తెలుగుదేశం పార్టీ నాలుగు సంవ‌త్స‌రాల పాటు నిరుద్యోగ భృతి గురించి ఎటువంటి ప్ర‌క‌టనా చేయ‌లేదు.. ఇక తాజాగా ఇప్పుడు మ‌ళ్లీ ఏపీలో నిరుద్యోగుల‌కు వ‌రం ఇస్తున్నారు.. యువ నేస్తం పేరుతో తెలుగుదేశం ఇప్పుడు నిరుద్యోగుల‌కు ఓ వ‌రం లాంటి అవ‌కాశాన్నిఇస్తోంది.. ఏపీలో నిరుద్యోగులు ఎంద‌రు ఉన్నారో వారి అంద‌రికి ఈ అవ‌కాశం ఉందా అంటే అందులో కొంద‌రికి మాత్ర‌మే అనే కండిష‌న్ పెట్టింది… నిజ‌మే ఇదంతా చేయాలి అంటే అమెరికా బ‌డ్జెట్ కూడా స‌రిపోదు.. అయితే రెండువేలు అన్నా నిరుద్యోగ భృతి కేవ‌లం వెయ్యిరూపాయ‌ల‌కు కుదించారు..అది కూడా కుటుంబంలో ఒక‌రికి వ‌స్తే మ‌రొక‌రికి రాదు, ఇలాంటి కండిష‌న్లు అప్లై అవుతాయి.

ఇక్క‌డ వైసీపీ తీగ‌లాగుతున్న అంశం ఇదే , ప్ర‌తీకుటుంబానికి ఉద్యోగాలు వ‌స్తాయి…ప్ర‌తీ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తాం అలా ఇవ్వ‌క‌పోతే నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పిన తెలుగుదేశం పార్టీ 48 నెల‌లుగా రూపాయి కూడా ఇవ్వ‌లేదు.. ఇప్పుడు కొత్త గా వ‌చ్చి ప్ర‌జ‌ల్ని మోసం చేయ‌డానికి రెడీ అవుతోంది అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు… తెలుగుదేశం పార్టీ కావాల‌నే ఇప్పుడు యువ‌త‌ను నిరుద్యోగుల‌ను బుట్ట‌లో వేసుకోవాల‌ని రెడీ అవుతోంది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అయితే జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు ప్ర‌తీ నిరుద్యోగికి 96 వేల రూపాయ‌లు అప్పు బ‌కాయి పడ్డారు అని విమ‌ర్శించేవారు.. ఇప్పుడు జ‌గ‌న్ కు ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా తెలుగుదేశం రెడీ అయింది.. యువ‌నేస్తం యువ‌కుల‌కు నిరుద్యోగుల‌కు ఆస‌రాగా నిలుస్తుంది అని భావిస్తున్నారు. ఇక జ‌గ‌న్ ఈ మాటకు పుల్ స్టాప్ పెట్టాల్సిందే అంటున్నారు తెలుగుదేశం నేత‌లు.. వెయిట్ అండ్ సీ, జ‌గ‌న్ ఇంకా దీనిని పాద‌యాత్ర‌లో ప్ర‌స్తావిస్తారో లేదా కొత్త రాగం అందుకుంటారో.