ఫ్లైట్ ఎక్కే ముందు జగన్ కు పీకే చెప్పిన మాట ఇదే

269

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థకు జగన్ స్వయంగా చేరుకుని పీకే బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల నుంచి నిర్విరామంగా వైసీపీ కోసం కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎన్నికల నేపధ్యంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే జరిపించిన సంగతి తెలిసిందే.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక పోలింగ్ జరిగిన తర్వాత తమ బృందం జరిపిన సర్వే నివేదికలను ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో 21 పార్లమెంటు స్థానాలతో పాటు 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతున్నట్లు పీకే బృందం తాజాగా జగన్ కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ సర్వే నివేదికలో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో ఫలితాలు జగన్ కు అనుకూలంగా వస్తాయి అని చెప్పారు. ఇక నార్త్ నుంచి వచ్చిన సర్వే టీమ్ ఇప్పటి వరకూ జగన్ టీమ్ తో కలిసి పనిచేశారు.. ఇప్పుడు తాజాగా జగన్ టీమ్ నుంచి వారు వేరే స్టేట్ కు వెళుతున్నారు.. ఇక్కడ జగన్ టీం అలాగే వైసీపీ నాయకులు సపోర్ట్ చేశారు అని చెప్పారు.  అయితే వైసీపీ తరపున చాలా మందికి మంచి మెజార్టీ వస్తుంది అని చెప్పారట. అంతేకాదు పార్టీ తరపున ఇప్పటి వరకూ సపోర్ట్ చేసిన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
Image result for jagan and kishore

ఇక చంద్రబాబు పై కూడా గతంలో పీకే ట్వీట్స్ పెట్టారు. అధికారంలోకి మీరే వస్తారు అని జగన్ కు కూడా చెప్పారు పీకే, మొత్తానికి నవరత్నాలు పేదలకు కొన్ని సంక్షేమ పథకాలు అన్నీ ఆలోచించింది ప్రశాంత్ కిషోర్ టీమ్ అని చెబుతున్నారు.. ఈఆలోచనల నుంచి వచ్చినవే నవరత్నాలు అని చెబుతున్నారు. మరి చివరగా పీకే ప్లేట్ ఎక్కే సమయంలో జగన్ కు ఈ విషయం చెప్పారట. మీరు మాస్ లీడర్ మీకు మంచి పేరు వస్తుంది, మీరే సీఎం మీ తండ్రి గురించి తెలుసు, ఆయన ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ఆయనలా మీరు కూడా మాస్ లీడర్ అవుతున్నారు.. మీరు కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వస్తా, ఆల్ దిబెస్ట్ అలాగే అడ్వాన్స్ కంగ్రాట్స్ మంచి పరిపాలన అందించాలి అని చెప్పారట.