గ‌వ‌ర్న‌ర్ ని క‌లిసిన వైసీపీ నేత‌లు రీజ‌న్ ఇదే ?

326

జ‌గ‌న్ పై జ‌రిగిన కోడిక‌త్తి దాడిపై విచార‌ణ జ‌రుగుతోంది. నేటితో జ‌గ‌న్ పై దాడి జ‌రిగి వారం రోజులు అయింది… ఇంకా సిట్ విచార‌ణ‌లో ఎటువంటి కీల‌క విష‌యాలు సూత్ర‌దారుల గురించి తెలియ‌లేదు అని వైసీపీ నిల‌దీస్తోంది. ఇటు జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి విష‌యంలో కేంద్రం హోంమంత్రిని క‌లిశారు. సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలి అని కోరారు… అయితే దీనిపై రెండు రోజులుగా చ‌ర్చ అయితే జ‌రుగుతోంది.

Image result for ycp mps meets rajanarsingh

 

తాజాగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను వైసీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా జగన్‌ మీద దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. జగన్‌పై దాడి ఘటన వెనుక ఎవరెవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.. దీనిపై గ‌వ‌ర్న‌ర్ కు వైసీపీ నేత‌లు అంద‌రూ క‌లిసి ఫిర్యాదు చేసి,ఈ దాడి ఘ‌ట‌న గురించి తెలియ‌చేశారు.