జ‌న‌సేన అభ్యర్థులను ప్రకటించిన పవన్ లిస్టు ఇదే

346

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో మూడు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది దీంతో ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు రచించాలో అని వ్యూహాల‌లో ఉన్నాయి రాజ‌కీయ పార్టీలు… వచ్చే ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. పోటీచేసే అభ్యర్థుల ప్రకటన విషయంలో మిగతా పార్టీల కంటే పవన్ ముందున్నారనే చెప్పుకోవచ్చు. ఆదివారం జరిగిన జనసేన శంఖారావం సభలో గుంటూరు, తెనాలి నుంచి జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. తెనాలి నుంచి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, గుంటూరు నుంచి తోట చంద్రశేఖర్‌లు పోటీచేస్తారని పవన్ తెలిపారు. తోట చంద్రశేఖర్ గురించి పవన్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో తనవల్లే ఆయన ఓడిపోయారని, 2009 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారని వ్యాఖ్యానించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గుంటూరు నుంచి గెలిపిస్తానని వ్యాఖ్యానించారు.

Image result for janasena

అలాగే తెనాలి నుంచి పోటీచేయబోయే నాదెండ్ల మనోహర్ తనకు కొండంత అండని, ప్రతికూల పరిస్థితుల్లోనూ సభను సజావుగా నిర్వహించారని పవన్ పేర్కొన్నారు. ఆయన జనసేనలో చేరకుండా కాంగ్రెస్‌లోకి వెళితే ఉన్నత పదవులు దక్కేవని, తాను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన శ్రవణ్‌ను ఏఐసీపీ కార్యదర్శని చేశారు.. మనోహర్‌కు అంతకంటే పెద్ద పదవే దక్కేదని, ఆయన దానికి అర్హుడని అన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గుంటూరు నుంచి పోటీచేయనున్న తోట చంద్రశేఖర్ మాజీ ఐఏఎస్ అధికారి. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఆయన థానే, నాగపూర్ మున్సిపల్ కమిషనర్‌గా సేవలు అందించారు. అనంతరం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి కమీషనర్‌గా పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇక, 2014లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనలో చేరారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక రావెల కిషోర్ బాబు కు కూడా టికెట్ ఇస్తార‌ని తెలుస్తోంది.. అయితే ఆయ‌న ఏ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేది మాత్రం ఇంకా ప‌వ‌న్ తెలియ‌చేయ‌లేదు… మొత్తానికి గుంటూరు జిల్లాలో ముగ్గురి పేర్లు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు అని జ‌న‌సేన కేడ‌ర్ సంతోషంలో ఉంది.