ఏపీలో ఓడిపోయే పది మంది మంత్రులు వీరే ఇదే లిస్ట్

769

తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో సరైన పూర్తి మెజార్టీ రాదు అంటున్నాయి ఏ సర్వేలు చూసినా, అంతేకాదు మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ప్రజా వ్యతిరేకత తప్పకుండా చవిచూస్తారు అని ఈ ఎన్నికల్లో టీడీపీ, 2004 -2009 ఎన్నికల ఫలితాల కంటే దారుణమైన ఓటమి చూడబోతోంది అని చెబుతున్నారు. ఏపీలో ప్రజలు ఇప్పుడు టీడీపీ పై వ్యతిరేకత చూపిస్తున్నారు అనేది నేరుగా తెలుస్తోంది,
ప్రభుత్వ వ్యతిరేక ఓటు సునామీలా తెలుగుదేశం సర్కారును ముంచేయబోతోందని అనేక సర్వేలు చెబుతున్నాయి. జాతీయ సర్వేలతో పాటు అనేక రాష్ర్టసర్వేలు కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోందని చెబుతున్నాయి. ఎంత ఘోరంగా అంటే కనీసం 10 మంది మంత్రులకు ఓటమి తప్పదట. ఇప్పుడు ఇలా మంత్రులు కూడా ఓటమి పాలు అవుతారు అని వార్తలు రావడంతో సిట్టింగ్ మంత్రులు డైలమాలో ఉన్నారు కోట్ల రూపాయల డబ్బులు కట్టలు ఎక్కడికక్కడ దొరకడం చూస్తుంటే ఓటర్లకు గాలం ఎలా వేస్తున్నారు అనేది తెలుస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు సునామీలా తెలుగుదేశం సర్కారను ముంచేయబోతోందని అనేక సర్వేలు చెబుతున్నాయి. జాతీయ సర్వేలతో పాటు అనేక రాష్ట్రసర్వేలు కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోందని చెబుతున్నాయి. ఇప్పటి వరకూ 5 సంవత్సరాలు పనిచేసిన 10 మంది మంత్రులకు ఓటమి తప్పదట. అలా ఓటమి చెందేవారి జాబితాలో.. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు.. విజయనగరం జిల్లాకు చెందిన సుజయక్రిష్ణ రంగారావు, విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఉన్నారట. ఇక తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఎదురీదుతున్నారట.

Image result for ap mps

గత ఎన్నికల్లో పవన్ మద్దతు పొందిన వీరు.. ఇప్పుడు జనసేన కూడా బరిలో ఉండటం.. వైసీపీ బలంగా ఉండటంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్నారట. అద్భుతాలు జరిగితే తప్ప వీరు గెలవడం కష్టమేనన్నిది క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నమాట. కృష్ణాజిల్లాలో మంత్రి దేవినేని ఉమ, తిరువూరులో మంత్రి జవహర్ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారట. కొవ్వూరులోనే వ్యతిరేకతతో తిరువూరుకు మారిన జవహర్‌కు ఓటమి తప్పదని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, కడప ఎంపీ సీటులో మంత్రి ఆదినారాయణరెడ్డి ఓటమిబాటలోనే ఉన్నారట. అన్నింటికంటే షాకింగ్ ఏమిటంటే.. చివరకు చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఓటమి దిశగానే సాగుతున్నాట. ఇక కుప్పంలో కూడా గట్టి పోటీ అయితే వైసీపీ అభ్యర్ది చంద్రమౌళీ ఇస్తున్నారు అని చెబుతున్నారు ఇక్కడ నేతలు. మరి చూడాలి మరో 45 రోజుల్లో ఫలితాలు ఎలా వస్తాయో మరో ఐదు సంవత్సరాల అధికార పీటం ఎవరికి దక్కుతుందో.