వివేకానందరెడ్డి హత్య కేసును చేదించిన పోలీసులు ఈ ఇద్దరే హంతకులు విచారణలో వీళ్ళు చెప్పిన నిజాలు వింటే షాక్

425

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ అనుమానిస్తున్న ఆయన అనుచరులపై దృష్టి పెట్టింది. వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. గంగిరెడ్డితో పరమేశ్వరరెడ్డి చేతులు కలిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగుళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

Image result for ys vivekananda reddy daughter

రూ.125 కోట్ల విలువ చేసే సెటిల్‌మెంట్ వ్యవహారంలో వారిద్దరి మధ్య వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దీనిలో రూ.1.5కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై నిశితంగా పరిశీలిస్తోంది. గంగిరెడ్డి పైనే అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతుండటంతో గత నాలుగు రోజులుగా ఆయనను రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందే రెక్కి నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకా హత్యకు ముందు పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆయ‌న మొబైల్ నెంబ‌ర్ కు ఓ మెసేజ్ రావ‌డం కూడా పోలీసులు విచార‌ణ‌లో కీల‌క కానుంది ఇక క‌డ‌ప‌లో మ‌రి కొంద‌రు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ చేస్తున్నారు పోలీసులు.

ముఖ్యంగా స్పెష‌ల్ టీం దీనిపై విచార‌ణ వేగ‌వంతం చేసింది అయితే ప‌రమేశ్వ‌ర‌రెడ్డి ఈ విష‌యంలో చెప్పేవి నిజాలా లేదా దీని వెనుక గంగిరెడ్డి ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి హ‌స్తం ఉందా అనే అనుమానం ముందు నుంచి ఉండ‌టంతో విచార‌ణ అటువైపు కొన‌సాగుతోంది ఇక పులివెందుల‌లోఓ రౌడీ షీట‌ర్ ని కూడా ఇప్ప‌టికే అదుపులోకితీసుకున్నారు…ఇత‌నితో 15 రోజులుగా ఎవ‌రు ట‌చ్ లో ఉన్నారు. వీరి బ్యాంక్ అకౌంట్లు వీరు ఎక్క‌డికి వెళ్లారు ఇలా అనేక విష‌యాలు ప‌రిశీలిస్తున్నారు. అయితే వీరి ఇద్ద‌రి నుంచి విడివిడిగా స‌మాచారం తీసుకుని అస‌లు ఎక్క‌డైనా లింక్ ఉందా అనే కోణంలో విచార‌ణ చేస్తున్నారు పోలీసులు. ఇక ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి ఆరోగ్యం ఎప్ప‌టి నుంచి బాగోలేదు, ఏ ఆస్ప‌త్రికి ముందు వెళ్లారు, నిజంగా అక్క‌డ ట్రీట్మెంట్ జ‌రుగుతుందా. ఇలా అనేక విష‌యాలు ఈ విచార‌ణ‌లో పోలీసులు ఇంట‌రాగేట్ చేస్తున్నారు .