వైసీపీ నుంచి కేంద్రంలో చక్రం తిప్పనున్న జగన్ మంత్రులు వీరే

210

కేంద్రంలో ఏపార్టీ అధికారంలోకి రాదని హంగ్ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని స్పష్టమైన సంకేతాలు రావడంతో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాంతీయ పార్టీల్లో ఏపార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయో ఆపార్టి నక్కతోక తొక్కినట్టే. తెలుగు రాష్ట్రాలనుంచి వైసీపీ పార్టీ కేంద్రంలో కీలకం కానున్నాయనె సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

Image result for jagan

ఇక వైసీపీ కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామనె ధీమాతో ఉంది.కేంద్రంలో హంగ్ వస్తే… ఏదో ఒక కూటమిలో చేరనున్న వైసీపీకి కచ్చితంగా కొన్ని మంత్రి పదవులు లభించడం ఖాయం. అదే విధంగా రాష్ట్రానికి ఏవరు ప్రత్యేక హోదా ఇస్తె వారికే తమ మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వస్తె స్పెషల్ స్టేస్ ఇస్తామని ప్రకటించింది. వైసీపీకీ వచ్చే రెండు మంత్రి పదువులు జగన్ ఎవరికి ఇస్తారో అన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

కేంద్రంలో వైసీపీ తరపున ఎవరు మంత్రులుగా ఉండే అవకాశం ఉందనే దానిపై కూడా రకరకాల వార్తలు మొదలయ్యాయి. మొదటి నుంచి తనకు అండగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మరో ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రంలో మంత్రులుగా అవకాశం కల్పించాలని వైసీపీ అధినేత భావిస్తున్నారని టాక్. మరో వైపు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేయకపోవడంతో… విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే అని తెలుస్తోంది. ఒకవేళ తాము అనుకున్న దానికంటే ఎంపీ సీట్లు అధికంగా వచ్చి కేంద్రంలో మరిన్ని పదవులు వచ్చే అవకాశం ఉంటె ఒక బీసీ, మరో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎంపీకి కేంద్రంలో మంత్రి పదవులను జగన్ ఇప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.