కాంగ్రెస్ తొలిజాబితాలో గ్రేట‌ర్ లో ఈ నాలుగు సెగ్మెంట్లు

289

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల న‌గారా స్టార్ట్ అయినా, ఇంకా అభ్య‌ర్దుల జాబితాల ద‌గ్గరే ఉంది.. కూట‌మిలో భాగంగా ఎవ‌రు ఎన్ని సీట్లు పంచుకోవాలి అనేది ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి…కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రకటించే తొలి జాబితాలో గ్రేటర్‌ అభ్యర్థులు ఎందరుంటారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది… గ్రేట‌ర్ లో ఇప్ప‌టికే కొన్ని సీట్లు తెలుగుదేశం త‌మ‌కు కావాలి అని కోరుతోంది. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తుంది అనేది చూడాలి.. టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలతో సీట్ల సర్దుబాటు చేసుకుని మహాకూటమిగా ఏర్పడిన నేపథ్యంలో.

Image result for rahul gandhi and chandrababu

ఇక తెలుగుదేశంతో పాటు తెలంగాణ జన సమితి కూడా గ్రేటర్‌లోని నియోజకవర్గాలను అడగడంతో కాంగ్రెస్‌ ఆశావహుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్ఠానం తొలి జాబితాను గురు, శుక్రవారాల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఎవ‌రికి అనేది కాదు ఏపార్టీకి వ‌స్తుంది అనేది ఇక్క‌డ‌ ఆలోచ‌న‌.కాంగ్రెస్‌ తొలి జాబితాలో ఎలాంటి వివాదాలూ లేని నియోజకవర్గాలను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలోని నాలుగైదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గోషామహల్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌, సనత్‌నగర్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, నాంపల్లి అభ్యర్థిగా ఫిరోజ్‌ఖాన్‌ పేర్లను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది కూక‌ట్ ప‌ల్లి సీటుపై ఇంకా క్లారీటీ రావాల్సి ఉంది.