ముంద‌స్తు ఎన్నిక‌లపై కేసీఆర్ కు స‌మ‌స్య‌లు ఈ జ్యోతిష్యులు చెప్పింది వింటే షాక‌వుతారు

428

తెలంగాణ సీఎం అసెంబ్లీని ర‌ద్దు చేసి మందుస్తు ఎన్నిక‌లు సిద్దం అయ్యారు అలాగే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం పై స‌ర్వ‌త్రా ఆలోచ‌న అయితే మొద‌లైంది…తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దుచేసిన తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గ్రహబలాన్ని నమ్మి ముందుకెళ్తున్నారు. అని అంటున్నారు ..ప్రతి అంశంలోని వాస్తు, జ్యోతిషానికి ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్.. గ్రహయోగం, తన అదృష్ట‌ సంఖ్యను బేరీజు వేసుకుని అన్ని విధాలా ఆలోచించాకే శాసనసభను రద్దు చేశారు. అయితే గ్రహబలాన్ని నమ్మి ముందస్తుకు సిద్ధమైన కేసీఆర్‌కు నిర్ణయంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్‌కు కష్టాలు ఎదురుకానున్నాయా? అంటే అవుననే అంటున్నారు జ్యోతిష్యులు. తన అదృష్ట సంఖ్య ప్రకారం 6వ‌ తేదీన అసెంబ్లీని రద్దు చేయడానికి ముందే ఎంతో కసరత్తు జరిగింది.

Image result for kcr

పునర్వసు, పుష్యమిలు సంధి నక్షత్రాలు కావనేది జ్యోతిషులు చెబుతున్న మాట‌. దీనికి మూలం మహాభారతంలో ఉందని చెబుతూ దానిని ఉదాహరణగా చూపుతున్నారు.మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు షరతు ప్రకారం పన్నెండేళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అరణ్య, అజ్ఞాతవాసాలు ముగిసిన తర్వాత పాండవులకు రాజ్యంలో అర్ధభాగం ఇవ్వాలని కోరుతూ కౌరవులతో సంధి కోసం శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేరుతాడు. ఇందుకోసం కార్తీక శుద్ధ ద్వాదశి రేవతీ నక్షత్రం రోజున బయలుదేరిన కృష్ణుడు భరణి నక్షత్రం నాటికి హస్తినకు చేరుకుంటాడు. ఏడు రోజులపాటు భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రాది పెద్దలతో చర్చిస్తాడు. కానీ, చివరికి సంధి ప్రతిపాదనను దుర్యోధనుడు తిరస్కరిస్తాడు. రారాజు తిరస్కరించిన రోజు పుష్యమి నక్షత్రం.

Image result for kcr

కాబట్టి, ఆ నక్షత్రం సంధి ప్రతిపాదనకు పనికిరాదని పెద్దలు భావిస్తారు.ఎన్నికలకు వెళ్లడమంటే ప్రజలతో సంధి కోరడమేనని, కాబట్టి కేసీఆర్ పెట్టుకున్న ముహూర్తం వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సెప్టెంబరు మాసంలో గ్రహాల గమనం అనుకూలంగా ఉండదని, రవి, శని ప్రతికూల ప్రభావం కారణంగా వ్యతిరేక ఫలితాలు దక్కుతాయని, సాయన సిద్ధాంతాన్ని అనుసరించే జ్యోతిషులు చెబుతున్నారు. ఇదే నెలలో రాజ్యాధికార కారుకుడైన రవికి శని 90 డిగ్రీల ప్రతికూల దృష్టిలోకి వస్తాడు.. దీంతో రాజకీయంగా సంక్షోభం నెలకుంటుందని అంటున్నారు. దీని ప్రభావం వల్ల భవిష్యత్తులో కేసీఆర్‌కు సమస్యలు, చిక్కులు ఎదురవుతాయని తెలియజేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆయన నిర్ణయాన్ని ప్రజలు హర్షించకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే పండితులు కూడా ఇదే వాదన వినిపించడం ఇక్క‌డ గ‌మ‌నించాల‌ని తెలుస్తోంది. వ్యక్తిగత జాతకం బట్టి కేసీఆర్‌కు భవిష్యత్తులో మంచి ఫలితాలే వచ్చినా, గోచారాన్ని బట్టి మాత్రం ఆయన తీసుకున్న ప్రస్తుతం నిర్ణయం ఊహించని కష్టాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మ‌రి కేసీఆర్ ముహూర్తం పెట్టి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు ప్ర‌జ‌లు ఎలా త‌మ స‌మాధానం చెబుతారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.