శిరిడి సాయి సమాది చెందిన ఈ 100 ఏళ్ళ లో జరిగిన అద్బుతాలు

390

కారణ జన్ముడిగా,దైవాంస సంభూతుడిగా అవతరించి ఎన్నో మహిమలను చాటిన మహాత్ముడు షిరిడీ సాయిబాబా.సాక్షాత్తు ఆ భగవంతుడే షిరిడీ సాయిబాబా గా అవతరించి షిరిడీలో కొలువై ఉన్నాడు.ఎన్నో మహిమల్ని చాటారు.ఆయన సమాది చెంది 2018 అక్టోబర్ 15కి వందేళ్ళు పూర్తీ కావస్తుంది.ఈ సందర్భంగా ఆయన కొన్ని రోజుల క్రితం షిరిడీలోని ద్వారకామాయి గోడపై ప్రత్యేక్షం అయ్యి భక్తులను ఆశ్చర్యానికి గురి చేసారు.ఆ వీడియోను మనం చూసాం కూడా.ఇంకా ఆయన చేసిన మహిమలను ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for shirdi sai

16 ఏళ్ల బాలుడిగా షిరిడీకి వచ్చి వేపచెట్టు నీడన ధ్యానంలో కూర్చొని తన మహిమలను చూపించి అద్భుతాలను స్పృష్టించిన అవతారపురుషుడు సాయిబాబా.ఆయన సమాధి చెందిన కూడా ఇప్పటికి భక్తులకు కనిపించి కనువిందు చేస్తున్నాడు.సాయి సమాధి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా వినాయక నిమజ్జనం రోజు చందమామలో సాయిబాబా ప్రత్యేక్షం అయ్యి ఈ లోకానికి నేను అండగా ఉన్నానని చెప్పాడు.కొలిస్తే వశమవుతాడు.ప్రార్థిస్తే కోరికలను తీరుస్తాడు.ఆయన జీవించి ఉన్న కాలంలో ఎలా అయితే అద్భుతాలను స్పృష్టించాడో సమాధి అయినా తర్వాత కూడా ఇప్పటికి తన మహిమలను చాటుతున్నాడు.దానికి నిదర్శనంగా జహీరాబాద్ లోని ఒక గుడిలో సాయిబాబా నిజ రూపంలో ప్రత్యక్షం అయ్యి పూజారిని ప్రసాదం అడిగి మరీ తీసుకున్నాడు.ఆ వీడియో కూడా మనలో చాలా మందే చూసి ఉంటారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దైవం మానవరూపంలో అని చెప్తారు.అంటే ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడాలని అర్థం.అయితే ఆ దేవుడే మానవ రూపంలో భూమి మీద వెలిశాడు.ఆయనే షిర్డీ సాయినాధుడు.ఒక్క అడుగు నా వైపు వేస్తే పది అడుగులు మీ వైపు వేస్తా అని ఏకదిశ సూత్రాలను చెప్పిన మహానుభావుడు సాయినాధుడు.సాయిబాబా జీవించినప్పుడు ఎన్నో అద్భుతాలను స్పృష్టించినాడు.అవన్నీ కథలు కథలుగా చెప్పుకుంటారు.సమాధి చెందిన తర్వాత కూడా తన మహిమలను చాటుతూ తాను ఈ లోకంలో ఇంకా జీవించి ఉన్నానని చాటిచెప్తునే ఉన్నాడు.దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.సాయినాధుడి భక్తులు అడుగడుగునా మనకు కనిపిస్తారు.ఆయన చెప్పిన లీలల గురించి వింటే కోట్లాదిమంది పులకించిపోతారు.శతాబ్ది ఉత్సవాలలోనే కాదు ఏ కాలంలో చుసిన బాబా ఆయన మహిమలను చాటుతూనే ఉన్నాడు.కలియుగం ఉన్నంతవరకు చాటుతూనే ఉంటాడు.కాబట్టి ప్రతి ఒక్కరు సాయిబాబాను నిష్ఠతో కొలవండి.సాయిబాబా కృపకు పాత్రులు కండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సాయిబాబా గురించి ఆయన మహిమల గురించి అలాగే ఆయన శతాబ్ది ఉత్సవాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.