వారికే మా మ‌ద్ద‌తు ఇస్తాం ఇందులో సందేహం లేదు

408

వైసీపీ అధినేత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ కాకినాడలో జ‌రుగుతున్న ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా మీడియాతో ముచ్చ‌టించారు… పార్ల‌మెంట్ లో అవిశ్వాస తీర్మానం పై జ‌రిగిన ఓటింగ్ అలాగే వీగిపోయిన ఈ తీర్మానం పై ఆయ‌న మాట్లాడారు.. . రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఒక్క మాటతో తేల్చేశారు..తాము ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నిక‌ల్లో వారికి మ‌ద్ద‌తు ఇవ్వాలి వీరికి ఇవ్వ‌కూడ‌దు అని అనుకోలేదు.. కేవ‌లం మాకు ఏపీ ప్ర‌యోజ‌నాలు ముఖ్యం, ఏపీకి ప్ర‌త్యేక హూదా ఎవ‌రు ఇస్తే వారికి మా మ‌ద్ద‌తు అని అన్నారు.

Image result for jagan latest photos

తెలుగుదేశం ప్ర‌భుత్వం ముందు ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ కావాలి అని కోరింది.. అందుకే కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీకి క‌ట్టుబ‌డి ఉండాలి అని చెబుతోంది.. తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు నైజం మారాలి.. ఆయ‌న త‌న ఎంపీల చేత రాజీనామా చేయించి పోరాటం చేయాలి.. అందుకే వారు మారాలి అని మంగ‌ళ‌వారం బంద్ కు పిలుపునిస్తున్నాం.. ఈ బంద్ కు నేత‌లు ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌తీ వ్యాపార‌స్దుడు, తెలుగు ప్ర‌జ‌లు అంద‌రూ స‌హ‌క‌రించాలి అని పిలుపునిచ్చారు వైయ‌స్ జ‌గ‌న్.

Image result for jagan latest photos

ఇక తెలుగుదేశం పార్టీ పై ప్ర‌జ‌ల్లో న‌మ్మకం లేదు.. అలాగే యూట‌ర్న్ తీసుకోవ‌డం వ‌ల్ల కేంద్రం కూడా ప్ర‌త్యేక ప్యాకేజీ తీసుకోమ‌ని చెబుతోంది అని ఆయ‌న విమ‌ర్శించారు… 25 కు 25 ఎంపీ స్దానాలు మాకు ఇవ్వండి కేంద్రంతో పోరాడి మేము ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధిస్తాం అని అన్నారు జ‌గ‌న్.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్యేక హూదా సంజీవ‌ని అన్న చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం ఎటువంటి ట‌ర్న్ లు తీసుకున్నారో ప్ర‌జ‌లు అంద‌రూ చూశారు అని ఆయ‌న అన్నారు…