రాజయ్య రాసలీలల సీక్రెట బయటపెట్టిన మహిళ రాజయ్య తర్వాత ఏం చేశాడో తెలుసా ..

485

తెలంగాణ‌లో ఇప్పుడు రాసలీల‌ల ఆడియో టేప్ వైర‌ల్ అవుతోంది ఓ పక్క తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఉంటే మ‌రో ప‌క్క రాజ‌య్య ఆడియో టేపు లీకేజీ ర‌చ్చ‌ర‌చ్చ చేస్తోంది… స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఇంతకాలం అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో పాటు, మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా రాసలీలలకు పాల్పడుతున్న తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎంతమాత్రం తమకొద్దని అసమ్మతి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మీడియా ఛాన‌ల్స్ లో మొత్తం రాజ‌య్య రాస‌లీల‌ల మ‌సాలా కోడై కూసింది. ఈయ‌న ప‌ద‌వులు పోయిన స‌మ‌యంలో ఎంత పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయో ఇప్పుడు ఈ మ‌హిళ విష‌యంలో కూడా ఇలానే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

Image result for రాజయ్య trs

ఇప్పటివరకూ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో తాము నిస్సందేహంగా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించామని, ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు వివిధ రకాల టీవీ చానళ్లలో ప్రసారమవుతున్న సంభాషణల కథనాల ఆధారంగా నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో చులకన భావం ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు… సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా, మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య తన స్థాయిని మరచి, ఒక మహిళతో చిల్లర మల్లరగా దిగజారుడు, అసభ్య ఫోన్‌ సంభాషణలు చేయడం హేయమైన చర్యగా చెప్పారు.

Image result for రాజయ్య trs
నాని అనే మ‌హిళ‌తో రాజ‌య్య ఫోన్లో సంభాషించారు.. నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, నువ్వు కొంటె పిల్ల‌వి అని ఆయ‌న న‌వ్వుతూ మ‌హిళ‌తో చిల్ల‌ర‌గా మాట్లాడారు.. ఎన్ని సార్లు వారితో వీరితో వెళ్లావు చెప్పు అంటూ ప‌ద్ద‌తి లేకుండా మాట్లాడారు. రేపు ఉద‌యం నీదగ్గ‌ర ఎనిమిది గంట‌ల‌కు ఉంటా అని చెప్పాడు రాజ‌య్య.. ఇలా వారిద్ద‌రి మ‌ధ్య ఘాటుగా సంభాష‌ణ జ‌రిగింది. ద‌యాక‌ర్ ద‌గ్గ‌ర‌కు ఎన్నిసార్లు వెళ్లావు అంటూ ఆమెని ప్ర‌శ్నించాడు. ఇలా పెద్ద‌స్ధాయి నాయ‌కుడు చేసిన చిల్ల‌ర‌ప‌నికి ఇప్పుడు అంద‌రి నుంచి పార్టీపై వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాని ఇక్క‌డ కొస‌మెరుపు ఏమిటి అంటే? తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్యను ఫోన్‌ ద్వారా వివరణ కోరగా.. తాను ఎవరితో, ఎలాంటి ఫోన్‌ సంభాషణలు చేయలేదని, తనకు మహిళలంటే అపారమైన గౌరవమని, ఎన్నికల సందర్భంలో తనంటే గిట్టనివారే ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారని, నిజానిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని ఆయన చెప్పారు.. ఇక ఆ మ‌హిళ‌ని ప్ర‌శ్నించాలి అని చూసినా, ఆమె ఇప్పుడు ఎక్క‌డికో వెళ్లిపోయింది అంటున్నారు.. ఆమె పార్టీ త‌ర‌పున నాయ‌కురాలు అని, ఆమె రాజ‌కీయ నాయ‌కుల‌తో ఎక్కువగా స‌త్సంబంధాలు పెట్టుకుంటుంది అని అంటున్నారు. ఈ ఆడియో టేపు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆమె బ‌య‌ట‌కు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు అని అంటున్నారు. చూశారుగా ఇలాంటి నాయ‌కుల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలి, దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.