వైయ‌స్ వివేకాను చంపింది సుధాకర్‌రెడ్డే బ‌య‌ట‌ప‌డ్డ అసలు నిజం

614

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది.
వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకాది హత్యేనని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో మర్డర్‌గా తేలిందని పోలీసులు చెబుతున్నారు. పోర్టుమార్టం అనంతరం వివేకా పార్థివదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. రిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలున్నట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. నుదిటిపై లోతైన రెండు గాయాలు, తలవెనుక భాగంలో.. తొడ భాగం, చేతిపైనా గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు.

Image result for ys vivekananda reddy dead body

పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే వివేకా శరీరంపై బలమైన గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా తల, చెయ్యికి గాయాలు కావడంపై అనుమానం మరింత పెరిగింది. పోస్టుమార్టం అనంతరం వివేకా భౌతికకాయాన్ని పులివెందులలోని నివాసానికి తరలించారు. వివేకా తలపై, చేతిపై గాయాలున్నాయని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ వెల్లడించారు. హత్య ప్రదేశంలో ఫింగర్ ప్రింట్స్ దొరికాయని ఆయన చెబుతున్నారు. గురువారం రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ఏం జరిగిందో తెలుసుకున్నామని ఎస్పీ చెప్పారు.

Image result for ys vivekananda reddy dead body

వైఎస్‌ వివేకానంద మృతిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అడిషనల్‌ ఎస్పీ బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. వివేకా మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనుమానాస్పద మృతి వార్తలపై చంద్రబాబు తక్షణమే స్పందించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు. వివేకా మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకా మృతి పట్ల అనుమానాలు రావడంపై వెంటనే స్పందించారు. అప్పటికప్పుడు పోలీస్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, కడప పోలీసులతో చంద్రబాబు మాట్లాడారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఈ స‌మ‌యంలో ఓ కీల‌కమైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది..వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. . అయితే వైఎస్ కుటుంబసభ్యులు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో సుధాకర్‌రెడ్డి జైలు శిక్ష అనుభవించాడు. మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద కడప సెంట్రల్‌ జైలు నుంచి సుధాకర్‌రెడ్డి విడుదలయ్యాడు. ఇప్పుడు పోలీసులు పాత ప‌గ‌ల కోణంలో ఈ హ‌త్య జ‌రిగిందా అనే విష‌యం పై కూలంకుషంగా విచార‌ణ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.