వివేకా హ‌త్య కేసులో జ‌గ‌న్ స‌న్నిహితుడి భార్య వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు

287

మాజీ ఎంపీ వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపిస్తూ.. తన భర్తను విచారణ పేరుతో పోలీసులు అక్రమంగా నిర్భందించి చిత్రహింసలు పెడుతున్నారని జగన్‌ సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సతీమణి తులసమ్మ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ నెల 21న తన భర్త శంకర్‌రెడ్డి ఆర్జేడీ పార్టీ తరఫున కడప పార్లమెంటుకు నామినేషన్‌ దాఖలు చేశారని పేర్కొన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదేశించడంతో తన భర్త 21వ తేదిన విచారణకు వెళ్లారని ఇప్పటి వరకూ ఆయన తిరిగి రాలేదని పేర్కొన్నారు. తన భర్తను చిత్రహింసలకు గురిచేస్తున్నారేమో అని అనుమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్జేడీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో 26న ఉదయం 11 గంటలకు అఫిడవిట్‌ ఇవ్వాల్సి ఉండగా పోలీసుల నిర్భంధంలో ఉన్న కారణంగా ఇవ్వలేకపోయామని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తన భర్తను విడుదల చేయాలని కోరారు. అయితే ఈ కేసులో మొత్తంన‌లుగురికి పూర్తిగా విచార‌ణ చేస్తున్నారు పోలీసులు, ఎలాంటి విచార‌ణ చేస్తున్నారు ఎక‌క్డ విచార‌ణ చేస్తున్నారు అనేది కుటుంబానికి కూడా తెలియదు దీంతో ఆ కుటుంబ స‌భ్యులు క‌న్నీరు పెడుతున్నారు.

Image result for ys vivekananda reddy

మ‌రో ప‌క్క ఇప్ప‌టికే సిట్ ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసింది.. ఈకేసులో ఇంటి స‌భ్యుల పాత్ర ఏమైనా ఉందా, ఆర్దిక లావాదేవీల విష‌యంలో స‌న్నిహితుల‌తో వివాదాలు వ‌చ్చాయా అనే కోణంలో ఆలోచ‌న చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి పోలీసుల విచార‌ణ‌లో అనేక విష‌యాలు బ‌య‌ట‌ప‌డినా ఇప్పుడు ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేద‌ని ఈ కేసు విష‌యంలో మొత్తం అన్ని విష‌యాలు తెలుసుకున్న త‌ర్వాత మాత్ర‌మే బ‌య‌ట‌పెడ‌తారు అని తెలుస్తోంది. ఈ కేసు మ‌రెన్ని విధాలుగా విచార‌ణ జ‌రుగుతుంది, ఇంకెన్ని విధాలుగా ఈ కేసులో నిందితులు ప‌ట్టుబ‌డ‌తారు అనేది తెలియాల్సి ఉంది.