కాంగ్రెస్ రెండో జాబితా విడుద‌ల

311

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ నేడు రెండో జాబితాను విడుదల చేసింది. విస్తృత సంప్రదింపుల త‌ర్వాత కూట‌మిలో చ‌ర్చ‌లు త‌ర్వాత ఎట్టకేలకు మలి జాబితా విడుదలైంది. ఖానాపూర్‌ (ఎస్టీ)లో ఊహించినట్టుగానే రమేష్‌ రాధోడ్‌కు అవకాశం కల్పించారు. ఖైరతాబాద్‌లో బీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌వైపు అధిష్టానం మొగ్గుచూపింది. ఇక, ఎల్లారెడ్డి నుంచి జాజల సురేందర్‌కు చోటుదక్కింది. ధర్మపురి (ఎస్టీ) టికెట్‌ను అదూరి లక్ష్మణ్‌ కుమార్‌కు కేటాయించారు.

Image result for congress

కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా ఇది

ఖానాపూర్‌ (ఎస్టీ) రమేష్‌ రాథోడ్‌
ఎల్లారెడ్డి జాజల సురేందర్‌
ధర్మపురి (ఎస్సీ) అదూరి లక్ష్మణ్‌ కుమార్‌
సిరిసిల్ల కేకే మహేందర్‌ రెడ్డి
మేడ్చల్‌ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ఖైరతాబాద్‌ దాసోజు శ్రవణ్‌
జూబ్లీహిల్స్‌ పి విష్ణువర్ధన్‌ రెడ్డి
షాద్‌నగర్‌ సీ ప్రతాప్‌రెడ్డి
భూపాలపల్లి గండ్ర వెంకట రమణారెడ్డి
పాలేరు కాందాల ఉపేందర్‌రెడ్డి