ఏపీలో జాతీయ మీడియా సర్వే ఫలితాలు చూసి షాకైన జగన్ చంద్రబాబు

303

ఏపీలో ఎన్నికల జోరు మొదలైంది.. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మూడు రోజులు మాత్రమే పోలీంగ్ కు సమయం కూడా ఉంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు ప్రచారాలకే కాకుండా పార్టీ ఎలాంటి పరిస్దితిలో ఉంది పార్టీ గెలుపు ఎలా ఉంది. అభ్యర్దుల పట్ల ప్రజలు ఎలా ఉన్నారు అనే ఆలోచనల్లో ఉన్నారు. ఇక ఏపీలో ఎలాంటి సర్వేలు వచ్చినా అన్నీ జగన్ కే పట్టం కడుతున్నాయి. తాజాగా జాతీయ పార్టీలు కూడా సాధించలేని మెజార్టీ జగన్ సాధిస్తారు అని అనేక సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఏ జాతీయ మీడియా చానల్ సర్వే అయినా చెప్పేది ఇదే.

Image result for tdp and ycp and jensana

కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని, తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. 106 ఎంపీ సీట్లలో విజయం సాధించడం ద్వారా ఢిల్లీ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నట్లు జాతీయ చానెల్‌ ఎన్డీటీవీ ఆదివారం అంచనా ఫలితాలను వెల్లడించింది. ఏపీలో 25 ఎంపీ సీట్లకుగానూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 20 పార్లమెంట్‌ స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఇప్పటికే అసెంబ్లీ స్ధానాల్లో వైసీపీ జోరుగా కనిపిస్తోంది 130 స్ధానాలు గెలుస్తుంది అని వార్తలు వినిపించాయి ఈ సమయంలో ఎంపీ సెగ్మెంట్లు 20 వైసీపీ సాధిస్తుంది అని చెప్పడంతో ఇది పార్టీకి మరింత బూస్ట్ అయింది. ప్రత్యేక హోదా ముఖ్య అంశంగా జగన్ రాజకీయంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళుతున్నారు ఇది జగన్ కు బాగా కలిసి వచ్చే అంశం అని చెబుతున్నాయి సర్వేలు.

ఈ క్రింది వీడియో చూడండి

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 30, తమిళనాడులో డీఎంకే 25 ఎంపీ సీట్లలో విజయబావుటా ఎగురవేస్తాయని తెలిపింది. ఒడిశాలో బిజూ జనతాదళ్‌ 16 సీట్లు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 15 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మొత్తం 106 ఎంపీ సీట్లతో ప్రాంతీయ పార్టీల మద్దతు కేంద్రానికి కీలకం కానుంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల అనంతరం ప్రబల శక్తిగా ఆవిర్భవించి దేశ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పలు జాతీయ చానెళ్లు ఇప్పటికే తమ సర్వేల ద్వారా అంచనా వేయడం తెలిసిందే. ఏపీలో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తుందని, తిరుగులేని విజయం సాధించి లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇండియా టీవీ సర్వేలో తేలింది. ప్రజలు స్పష్టంగా వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. ఇతర జాతీయ ఛానళ్లు కూడా వైఎస్సార్‌సీపీ 20 – 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తమ సర్వేల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ప్రకటించాయి.

Image result for tdp and ysrcp and janasena logo

టైమ్స్‌ నౌ, సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18, ఇండియా టుడే తదితర జాతీయ చానెళ్లు వైఎస్‌ జగన్‌పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. ప్రముఖ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయి, బర్కాదత్, నావికా కుమార్‌ తదితరులు వైఎస్‌ జగన్‌తో సంభాషించి ఏపీతోపాటు దేశ రాజకీయాల్లో ఆయన అనుసరించనున్న వైఖరిని తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అతి త్వరలోనే వైఎస్‌ జగన్‌ దేశ రాజకీయాల్లో పోషించనున్న కీలక పాత్రకు ఇవన్నీ సంకేతాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి మూడురోజుల్లో పోలీంగ్ కూడా ముగియనుంది.