ఆ పోస్టు కావాలంటే రూ. 50 ల‌క్ష‌లు ఇవ్వాలంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

431

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజ‌కీయాలు ఎలా ఉన్నా ఇటు టీఆర్ ఎస్ రాజ‌కీయాలు మ‌రింత హీటు పుట్టిస్తున్నాయి.. డీఎస్ ఎపిసోడ్ ఆయ‌న కుమారుడి రాజ‌కీయం అలాగే ఎంపీ క‌విత వ‌ర్గీయులు డీఎస్ వ‌ర్గీయుల మ‌ధ్య మ‌రింత హీటు పుట్టిస్తున్నాయి, ఇక్క‌డ రాజ‌కీయాలు.. ఇక దీనిపై ఎంపీ క‌విత కూడా అధిష్టానం చూసుకుంటుంది అని త‌న మాట‌గా తెలియ‌చేశారు..

Image result for nizamabad ganesh gupta mla

ఇక తాజాగా నిజామాబాద్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి కావాలి అంటే రూ.50 లక్షలు ఇస్తే ఇస్తాన‌ని, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా డిమాండ్‌ చేశారని, టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్‌ పోశెట్టి ఆరోపించారు. దీంతో పార్టీలో మ‌రో క‌ల్లోలం ఏర్ప‌డింది.

Image result for nizamabad ganesh gupta mla

50 ల‌క్ష‌ల రూపాయ‌ల డిమాండ్ విష‌యం ఇప్ప‌డు పార్టీలో పెద్ద చ‌ర్చకు దారి తీసింది.. నిజామాబాద్ లో ఆయ‌న ఈ కామెంట్లు చేశారు.. అయితే అధికార పార్టీ పై ఎన్నిక‌ల వేళ ఇటువంటి వ్యాఖ్య‌లు వార్త‌లు కామెంట్లు రావ‌డం పై ప్ర‌జ‌ల్లో ఎటువంటి ప‌రిస్దితి వ‌స్తుంది అని అనుకుంటున్నారు.. అయితే దీనిపై ఆయ‌న మ‌రింత ఫైర్ అవుతూ వ్యాఖ్య‌లు చేశారు.. ఎమ్మెల్యే ఈ ప‌ద‌వి విష‌యంలో డ‌బ్బులు డిమాండ్ చేయ‌లేద‌ని, ఆల‌యం మెట్లు ఎక్కి ప్ర‌మాణం చేస్తారా అని ప్ర‌శ్నించారు.. తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటాను ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేదు అని మీరు నిరూపిస్తారా అని ఆయ‌న స‌వాల్ చేశారు.