పోలీసుల‌కు రాత్రి జ‌రిగింది మొత్తం చెప్పిన వివేకానంద‌రెడ్డి వాచ్ మెన్

347

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైసీపీ తరపున ఆయన పులివెందులలో నిన్న ప్రచారం కూడా చేశారు. ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని మార్చి 3వ తేదీన వైఎస్ వివేకా పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆయన హఠాన్మరణంతో జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హుటాహుటిన లోటస్‌పాండ్ నుంచి పులివెందులకు జగన్ కుటుంబ సభ్యులు బయల్దేరారు. ఇక వైయ‌స్ వివేకాని చివ‌రి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున నాయ‌కులు చేరుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో ఓ కీల‌క విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Image result for ys vivekananda reddy

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. ఆయన శ‌రీరంపై క‌త్తి గాయాలు ఉండ‌టంతో ఆయ‌న‌ని మ‌ర్డ‌ర్ చేశారు అని ప్రాధ‌మికంగా పోలీసులు భావిస్తున్నారు. ఇక అత‌ని ఇంటిలో ప‌నిచేసే వ్య‌క్తి కొన్ని కీల‌క విష‌యాలు తెలియ‌చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి 

రాత్రి 11 గంట‌ల‌కు వ‌చ్చారు అని అప్పుడు టిఫిన్ చేసి కాసేపు బ‌య‌ట నించున్నార‌ని, ఈ స‌మ‌యంలో ఇంకా ప‌డుకోలేదా అని ప‌ల‌క‌రించారు అని తోట‌మాలి తెలియ‌చేశాడు ఇక 11 గంట‌ల 10 నిమిషాల‌కు లోప‌ల‌కు వెళ్లి గ‌డియ పెట్టుకుని ప‌డుకున్నారు అని ఉద‌యం పీఏ కృష్ణారెడ్డి వ‌చ్చార‌ని సార్ ఇంకా లేవ‌లేదా అని అడిగార‌ని ఆయ‌న త‌లుపు త‌డితే గెడియ పెట్టి ఉంది అని చెప్పారు ఇక బెడ్ రూమ్ వెనుక భాగంలో డోర్ తీసి ఉండ‌టంతో లోప‌ల చూశాము అని బెడ్ రూమ్ లో ర‌క్త‌పు మ‌ర‌క‌లు కనిపించాయి, త‌ర్వాత వివేకానంద‌రెడ్డి క‌నిపించ‌క‌పోవ‌డంతో బాత్రూంలో వెతికామ‌ని అక్క‌డ ఆయ‌న శ‌వం క‌నిపించింది అని ఇంటిలో ప‌నిచేసే వ్య‌క్తి పోలీసుల‌కు తెలియ‌చేశారు, ఇంటి వెనుక వైపు బెడ్ రూమ్ డోర్ తెరిచి ఉండ‌టంతో ఇప్పుడు ఇక్క‌డ బ‌ల‌మైన అనుమానం క‌లుగుతోంది.మ‌రి పోలీసుల విచార‌ణ‌లో దీనిపై స్ప‌ష్ట‌మైన విష‌యాలు తెలియాల్సి ఉంది.