29 న జ‌గ‌న్ మ‌రో మీటింగ్

427

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల‌కు అండ‌గా ఉంటుంది అని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు.. రైతుల సంక్షేమ‌మే మా ఉద్దేశం అని అన్నారు ఆయ‌న .. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే రైతుల‌కు మంచి రోజులు వ‌స్తాయి అని. రైతులకు గిట్టుబాటు ధరలను కల్పిస్తానని హామీ ఇచ్చారు… తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగింది.

Image result for jagan padayatra

ఈ స‌మ‌యంలో ప‌లువురు రైతులు రైతు కూలీలు స‌మ‌స్య‌లు తెలియ‌చేశారు.. క‌చ్చితంగా అన్నింటి పై మేనిఫెస్టోలో తెలియ‌చేస్తాము అని రైతుల‌కు మ‌రింత మంచి చేసే ప‌థ‌కాలు పెడ‌తాము అని తెలియ‌చేశారు ఆయ‌న‌….దివ్యాంగులను పలుకరించి వారి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హూదా పై త‌మ రూటు మార‌దు అని, యూ ట‌ర్న్ తీసుకోము అని అన్నారు జ‌గ‌న్… ఇక్క‌డ నాలుగు కిలోమీట‌ర్లు మేర న‌డిచి ఆయ‌న పాద‌య‌త్ర‌కు బ్రేక్ ఇచ్చి హైద‌రాబాద్ వెళ్లారు.

Image result for jagan

ఈ నెల 29న జగ్గంపేటలో రాష్ట్రస్థాయి వైసీసీ కోఆర్డినేటర్ల సమావేశం జరుగుతుందని తెలిపారు వైసీపీ నాయ‌కులు… ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ ఎటువంటి కీల‌క పిలుపు నాయ‌కుల‌కు ఇవ్వ‌నున్నారు అనేది తెలియ‌నుంది. ఇక పాద‌యాత్ర త‌దుప‌రి ఉత్త‌రాంధ్రా జిల్లాలోకి ప్ర‌వేశించ‌నున్న నేప‌థ్యంలో, జ‌గ‌న్ ఇక్క‌డ ఎటువంటి ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ‌తారా అని కూడా నేత‌లు ఎదురుచూస్తున్నారు.