వాజ్ పేయ్ చివరి క్షణాలు.. చనిపోయే ముందు ఏం జరిగిందో తెలుసా

446

మాజీ ప్రధాని, బీజేపీ తొలి అధ్యక్షుడు, ఆధునిక రాజకీయాల్లో మేరునగధీరుడు, ‘భారతరత్న’ అటల్ బిహారీ వాజ్‌పేయి ఇకలేరు. యావత్ భారతదేశాన్ని దు:ఖసాగరంలో ముంచేస్తూ గురువారం సాయంత్రం ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతితో బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు…దిల్లీలోని ఎయిమ్స్ లో గ‌త రెండు రోజులుగా ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించింది.. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఎంతో ఆందోళ‌న వ‌చ్చింది.. అయితే ఆయ‌న చ‌నిపోయే ముందు వెంటిలేట‌ర్ పై చికిత్స అందిచారు..ఈ స‌మ‌యంలో ఆయ‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రు వ‌చ్చి ప‌ల‌క‌రించినా సంజ్ఞ‌లు చేశారు అని తెలుస్తోంది..

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అలాగే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వెంకయ్య నాయుడు ఇలా పెద్ద‌లు ఎవ‌రు వెళ్లినా ఆయ‌నను చూసి దుఖ సాగ‌రంలో మునిగిపోయారు… రాజ‌కీయ హిమ‌శిఖ‌రుడు అలా వెంటిలేట‌ర్ పై చికిత్స పొంద‌డాన్ని చూసి బీజేపీ సీనియ‌ర్లు కూడా జీర్ణించుకోలేక‌పోయారు.. కాని వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్న స‌మ‌యంలో ఆయ‌న ప‌రిస్దితి విష‌మించింది.. మ‌ధ్యాహ్నం ఆయ‌న శ‌రీరం చికిత్స‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో డాక్ట‌ర్లు ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వానికి తెలియ‌చేశారు.. ఇక ఆయ‌న కొద్ది గంట‌ల్లో మ‌ర‌ణిస్తారు అని తెలియ‌చేశారు.. అందుకే రాత్రి ఆయ‌న్ని ప‌రామ‌ర్శించిన ప్ర‌ధాని మోదీ మ‌రోసారి వ‌చ్చి ఆయ‌న్ని చూశారు అనేది దేశ జ‌నాభాకు తెలిసింది.

చివ‌రి క్ష‌ణాలు ఆయ‌న ముందు ఉన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ.. ఆయ‌న ప‌క్క‌న ఉన్న స‌మ‌యంలో వాజ్ పెయ్ కోలుకుంటారు అని అనుకున్నా ఆయ‌న శ‌రీరం చికిత్సకు స‌హ‌క‌రించ‌లేదు.. అవ‌య‌వాలు పనిచేయ‌కుండా పోతున్నాయ‌ని వెంటిలేట‌ర్ పై చికిత్స అందించిన వైద్యులు తెలియ‌చేశారు.

ఇక కొద్ది రోజుల‌గా చికిత్స తీసుకుంటున్న ఆయ‌న నేడు తిరిగిరాని లోకాల‌ను వెళ్ల‌బోతున్నార‌ని, బీజేపీ శ్రేణుల‌కు డాక్ట‌ర్లు ఓ క్లారిటీ ఇచ్చారు.. దీంతో ఆయ‌న వెంటే ఉన్నారు బీజేపీ కీల‌క నేత‌లు. ఆయ‌న మ‌ర‌ణానికి కొద్ది గంట‌ల ముందు కూడా ఆయ‌న్ని ప‌ల‌క‌రించ‌డానికి వ‌చ్చిన వారిని సైగ‌ల‌తోనే ప‌ల‌క‌రించారు.. చివ‌ర‌కు వారికి తుదివీడ్కోలు చెప్పి తిరిగిరానిలోకాలకు ప‌య‌న‌మ‌య్యారు అట‌ల్ బిహారి వాజ్ పెయ్.. ఆయ‌న కుటుంబం కూడా ఇప్ప‌టికే ప్ర‌త్యేక విమానంలో దిల్లీ చేరుకుంటోంది. ఆయ‌న అంతిమ సంస్కారాలు ప్ర‌భుత్వం చేయ‌నుంది.