నేడు వైసీపీ కీలక ప్ర‌క‌ట‌న

412

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌స్తుతం విశాఖ‌లో జ‌రుగుతోంది.. ఈ స‌మ‌యంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర స్థాయి సమావేశం విశాఖపట్నంలోని విశాఖ ఫంక్షన్‌ హాలులో నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఇంచార్జ్ లు, మాజీ ఎంపీలు, అంద‌రూ హాజ‌ర‌వ‌నున్నారు.

Image result for jagan group meeting

నేడు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ స‌మావేశం జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. చిన వాల్తేరు ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ ప్రాంతాల్లో పాదయాత్ర త‌ర్వాత జగన్‌ ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, రీజినల్‌ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్ప‌టికే చేరుకున్నారు.

Related image
ఇకపార్టీ త‌ర‌పున కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు అని తెలుస్తోంది.. పార్టీ త‌ర‌పున నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం అలాగే ఎన్నిక‌ల‌కు సిద్దం కావాలి అని జ‌గ‌న్ తెలియ‌చేయ‌నున్నారు…ఇటు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఏపీలో తెలుగుదేశం పార్టీ సాహ‌సించ‌దు, అందుకే ఏపీలో ముంద‌స్తు ఉండ‌దు అని తెలియ‌డంతో ఇక వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల కోసం రెడీ అవ్వాలి అని చూస్తున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నాయ‌కుల ప‌నితీరు గురించి గ్రాఫ్ స‌ర్వే రిపోర్టు తెప్పించుకున్న జ‌గ‌న్, ఇక్క‌డ సెగ్మెంట్ల గురించి ప‌లు విష‌యాలు తెలియ‌చేస్తారు అని తెలుస్తోంది. ఇక వైసీపీ కీల‌క ప్ర‌క‌ట‌న రాజీనామాల విష‌యం లో కూడా ఏమైనా తీసుకుంటుందా అని ఆలోచ‌న అయితే వ‌స్తోంది.