2019లో ఏపీలో ఎవరు అధికారం లోకి రాబోతున్నారో తేల్చేసిన కేసీఆర్ సర్వే

566

తెలంగాణ లో ఎన్నికలు అయిపోవడంతో ఇప్పుడూ అందరి కళ్ళు ఏపీ మీద పడ్డాయి .ఎవరు అధికారంలోకి రావొచ్చునని ఇప్పటికే చాలా సర్వే లు వచ్చాయి . నేష‌నల్ మీడియా స‌ర్వేలు ఎలా ఉన్నా, ల‌గ‌డ‌పాటి స‌ర్వే అంటే అంద‌రూ ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో ఏమి ఉంటుంది అని చూస్తు ఉంటారు. ఈ స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి స‌ర్వేని ఇక న‌మ్మే ప‌రిస్దితి లేదు అని చెబుతున్నారు. ఇలా ఎందుకు అని అనుకుంటున్నారా? తెలంగాణ‌లో ల‌గ‌డ‌పాటి 100 కి 100 శాతం ఫెయిల్ అవ్వ‌డ‌మే దీనికి కార‌ణం అని అంటున్నారు విశ్లేష‌కులు, అందుకే ఏపీలో ల‌గ‌డ‌పాటి స‌ర్వేని ఎవ‌రూ న‌మ్మ‌రు అని చెబుతున్నారు.

Image result for kcr

అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది.? అన్న విషయమై తెలంగాణలో సర్వేలు జోరందుకున్నాయి. ‘తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడతాం.. చంద్రబాబుకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం..’ అని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెల్సిందే.నిజానికి, అంతర్గతంగా సర్వేలు నిర్వహించి.. పక్కా సమాచారంతో, తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు కేసీఆర్‌. ఆయన అంచనాలు తప్పలేదు. ఆశించిన రీతిలోనే ఫలితాలొచ్చాయి. 88 సీట్లలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఒకవేళ కేసీఆర్‌ గనుక ఆంధ్రప్రదేశ్‌లో సర్వే చేయిస్తే, ఆ సర్వేకి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫలితాలు రావొచ్చన్న నమ్మకం.. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ గట్టిగానే కన్పించనుంది.

టీఆర్‌ఎస్‌ సంగతి పక్కన పెడితే, టీఆర్‌ఎస్‌ మద్దతుదారులూ ఇంతకుముందే.. అంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. ఆంధ్రప్రదేశ్‌లోనూ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ సర్వేల ప్రకారం, తెలుగుదేశం పార్టీకి 4 ఎంపీ సీట్లు వస్తే చాలా గొప్ప.. అని తేలిందట. అన్నట్టు, పలు జాతీయ సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అధికారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదేననీ, జనసేన పార్టీ ప్రభావం పెద్దగా వుండదనీ, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోబోతోందని జాతీయస్థాయి సర్వేలు ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేశాయి. మరితాజాగా కేసీఆర్ స‌ర్వేలో ఏపీ అసెంబ్లీలో 20 నుంచి 35 సీట్లు టీడీపీ గెలుచుకుంటుంది అని జ‌న‌సేన‌కు 10 సీట్లు క‌ష్టం అని ఇక మిగిలిన చోట్ల వైసీపీ గెలుపు త‌థ్యం అనేది తేలింద‌ట‌. మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయం తెలియ‌చేయండి. ఏపీలో కేసీఆర్ స‌ర్వే నిజంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అని మీరు భావిస్తున్నారా. లేదా అనేది తెలియ‌చేయండి.