జగన్‌పై దాడి కేసులో ఏపీ సర్కారుకు హైకోర్టు ప్రశ్న

289

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ పై జ‌రిగిన క‌త్తిదాడి విష‌యంలో కోర్టులో విచార‌ణ‌లు జ‌రుగుతున్నాయి…ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మెహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడికి సంబంధించిన కేసును హైకోర్టు సోమవారం విచారించింది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేశారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.. అలాగే మ‌రో ప్ర‌శ్న వేసింది కోర్టు..ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సర్కారును ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Image result for jagan

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల‌రామ‌కృష్ణారెడ్డి వేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న వాజ్యం పై ఈ వాద‌న‌లు జరిగాయి ఆయ‌న ఎన్ఐఏతో ఈ దాడి విష‌యంలో విచార‌ణ జ‌రిపించాలి అని కోరారు. అలాగే పోలీసులు కూడా కావాల‌నే ఈ కేసును త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు అని సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారని పిటిషనర్ ఆరోపించారు.జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందని, ఎన్ఐఏ యాక్ట్‌లోని సెక్షన్ 6 ప్రకారం ఎయిర్‌పోర్ట్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏదైనా ఘటన జరిగితే విచారణ ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందనే విషయం పోలీసులకు తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరించారని, 166 ప్రకారం వాళ్లు కూడా శిక్షార్హులేనని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌లో పేర్కొన్నారు. బుధ‌వారం వాద‌న‌లు మ‌రోసారి కోర్టు ముందు వినిపించ‌నున్నారు ఇరువురు..