వైఎస్ కుటుంబానికి శాపం… నమ్మలేని నిజాలు

332

వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. వివేకా హత్యోదంతంపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కీలక చర్చ నడుస్తోంది. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలితో నరికి వివేకాను బెడ్ రూంలోనే చంపేసిన దుండగులు దానిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు డెడ్ బాడీని బాత్ రూంలోకి తీసుకెళ్లారు. బాత్ రూంలో కమోడ్ తగిలి చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేసిన దుండగులు గుట్టు చప్పుడు కాకుండా తప్పుకున్నారు. ఈ క్రమంలో తెల్లారిన తర్వాత హత్య వెలుగులోకి రాగా వైఎస్ ఫ్యామిలీ షాక్ కు గురైంది .

సహజ మరణం కాదని, హత్యకు గురయ్యారని పోస్టుమార్టంలో తేలడంతో రాజకీయ రంగును పులుముకుంది. దీనిపై అధికార టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ పాత్ర ఉందంటూ వైసీపీ నేతలంటే, జగన్ కుటుంబంలో గొడవల వల్లే వివేకాను హత్య చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల వేళ ఈ హత్యోందంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తొలుత గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం జరిగినా తర్వాత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన రక్తపుమడుగులో విగతజీవిగా పడిఉండటం, శరీరంపై బలమైన కత్తిపోట్లు కనిపించడంతో ఎవరో హత్య చేశారని పోస్టుమార్టం చేయడానికి ముందే అంచనావేశారు. పోస్టుమార్టం నివేదికలో అది నిజమేనని తేలింది. దీంతో కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం విచారణను వేగ‌వంతం చేసింది.

ఆయ‌న కేసును ప్ర‌త్యేకంగా విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. దనపు ఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామని క‌డ‌ప ఎస్పీ రాహుల్ దేవ్ శ‌ర్మా తెలిపారు.వివేకానందరెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు.ఇప్పటికే కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వివేకా మృతిపై లోతుగా విచార‌ణ జ‌ర‌పాల‌ని ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.చూడాలి మరి పోలీస్ విచారణలో ఏం తేలుతుందో. మరి వివేకానంద హత్య గురించి హత్య వెనుక ఉన్న అనుమానాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.