నిజంగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పార్టీలో ఎంతో మంది చర్చించుకుంటున్న అంశం.. పార్టీ ఎలా ఉన్నా మాత్రం ఇప్పుడు చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీ ని దించాలి అనే ఎత్తుగడలతో ఇలాంటి ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఇక తెలంగాణలో ఇలా ఉంటే ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి పొజిషన్ కనిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా తెలుగుదేశం పై విమర్శలు చేయడం లేదు. ఇది ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం.
బీజేపీ ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వ పరిపాలనే మేలు అనిపిస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ… రైతులను నమ్మించి బీజేపీ ప్రభుత్వం గొంతు కోసిందని విమర్శించారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజున హింసను ప్రోత్సహించిందని తూర్పారబట్టారు. జై జవాన్- జై కిసాన్ అనే నినాదం వదిలేసి జై జపాన్- జై కార్పొరేట్ అని అంటోందని ధ్వజమెత్తారు. కోర్టుఇచ్చిన ఫ్రీ సెక్స్ తీర్పు పైన బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం అరాచకమని, ఇది మన సంప్రదాయానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
ఇక బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఏపీలో పాలనపై ఎటువంటి కామెంట్లు చేయడం లేదు.. ఇలా వ్యంగ్యాస్త్రాలు వదిలిన ఆయన తెలుగుదేశం సర్కారుపై గత ఆరునెలలుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు ఎటువంటి కామెంట్లు చేయకపోవడం పై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అయింది. రైతులకు దేశవ్యాప్తంగా 2లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, అలాగే జీఎస్టీని సరళీకృతం చేసి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేస్తాము అని చెబుతున్నారు రఘువీరారెడ్డి.