ఏపీలో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన సీఎం 20 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్న‌ల్

354

ఏపీలో ఎప్ప‌టి నుంచో నిరుద్యోగ యువ‌త ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు.. ప్ర‌భుత్వ నోటిఫికేష‌న్ ఎప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆత్రృత‌గా ఉన్నారు.. ఈ స‌మయంలో ఏపీలో నిరుద్యోగ భృతికి కూడా ఇటీవ‌లే మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది స‌ర్కారు, దీనిపై ఇప్ప‌టికే యువత‌కు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.. అలాగే ప్రైవేట్ ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం ముందుకు వెళుతోంది.. ఈ స‌మ‌యంలో తెలుగుదేశం స‌ర్కారు నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది అనే చెప్పాలి. వివిధ శాఖల్లో 20వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం జరుగనుంది. వివిధ శాఖలలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

Image result for నిరుద్యోగుల‌
ఏపీలో ఏయే కేడ‌ర్లో నియామకాలు జ‌రుగుతాయి అనేది ఓసారి ప‌రిశీలించిన‌ట్లు అయితే
గ్రూప్-1 : 150 ఖాళీలు
గ్రూప్-2 : 250 ఖాళీలు
గ్రూప్-3 : 1,670 ఖాళీలు
డీఎస్సీ ద్వారా : 9,275 ఖాళీలు
పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ : 3,000 ఖాళీలు
వైద్య శాఖల్లో : 1,604 ఖాళీలు
ఇతర శాఖల్లో : 1,636 ఖాళీలు

Image result for నిరుద్యోగుల‌

దీనిపై త్వ‌ర‌లోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుద‌ల చేస్తుంది అని తెలుస్తోంది.. దీనికి సంబంధించి ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి ఆదేశాలు జారి అవుతాయిని అంటున్నారు.. అలాగే ఎన్నిక‌ల‌కు ముందే ఈ నోటిఫికేష‌న్లు ఉంటాయ‌ని చెబుతున్నారు, ఇప్ప‌టికే గ్రూప్స్ కు సంబంధించి ప్రిపేర్ అయ్యేవారికి ఇది ఓ మంచి అవ‌కాశంగా చెప్ప‌వ‌చ్చు.. తాజాగా సీఎం తీసుకున్న నిర్ణ‌యం పై యువ‌త నుంచి పెద్ద ఎత్తున హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది, ఓవైపు తెలంగాణ‌లో ఇలా నోటిఫికేష‌న్లు వ‌చ్చినా ఏపీలో రాలేదు అని యువ‌త ఇప్ప‌టి వ‌ర‌కూ విమ‌ర్శ‌లు చేశారు, తాజా డెసిష‌న్ తో ఆనందంలో ఉన్నారు యువ‌త‌.