అందుకే ప‌రిటాల ఇంటికి వెళ్లాను – ప‌వ‌న్

323

అనంత‌పురం జిల్లాలో ప్ర‌జాపోరాట యాత్ర‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు స‌టైరిక్ కామెంట్లు పొలిటిక‌ల్ స‌టైర్లు వేస్తున్నారు.. ముఖ్యంగా అనంత‌పురం బ్ర‌ద‌ర్స్ అదే అనంత ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి అలాగే త‌మ్ముడు తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డిపై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. రౌడీ రాజ‌కీయాలు చేయాలి అంటే కుద‌ర‌దు అని చెప్పారు.

Image result for paritala family pawan

నేను భయపడేవాడినికాదు. చేతిలో తుపాకీ, కొడవలి పట్టలేదు. మాటలే మా బుల్లెట్లు. 2014లో నా సహాయం కోరితే బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చాను. వారితో కలిసి పనిచేశాను. ఆ క్రమంలోనే జిల్లాలోని పరిటాల సునీత, ఇతర టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లాను. అది నా సంస్కారం. నాయకుల మధ్య సమన్వయం లేకపోతే సమస్యలు పరిష్కారం కావు. ఆ క్రమంలోనే ఎంపీ జేసీని కూడా కలిశాను. ఈ విషయాలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, ముఖ్యంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలుసుకోవాలి. అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.