ఆర్టికల్ 370 రద్దులో కీలక పాత్ర పోషించిన తెలుగు వ్యక్తి

169

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యకే హక్కులు కల్పిస్తోన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు మోదీ సర్కారు గత ఏడాది ఆగస్టు నుంచే వ్యూహరచన చేసిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీడీపీతో జతకట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, 2018 జూన్‌లో తప్పుకొంది. అలాగే 2008 నుంచి ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగుతోన్న ఎన్ఎన్ వోహ్రా స్థానంలో సీనియర్ రాజకీయ నేత సత్యపాల్ మాలిక్‌ను 2018 ఆగస్టులో నియమించింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రాంతీయ పార్టీలైన పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటుండగా 2018 డిసెంబర్‌లో రాష్ట్రపతి పాలన విధించి వారికి షాక్ ఇచ్చింది. గవర్నర్‌ నియామకం దగ్గర నుంచే బీజేపీ వ్యూహం మొదలయింది.

Secretary Legislative Department Dr.GNarayanaRaju key role in article 370 revoke in jammu kashmire

వాస్తవానికి అక్కడ గవర్నర్లుగా అధికారులను నియమించడం సంప్రదాయంగా కొనుసాగుతుండగా, రాజకీయ నేత మాలిక్‌ను పంపి తన వ్యూహాలను అమలుచేసింది. అలాగే, గత అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి 40వేల మందికి రాజకీయ ఉపాధి కల్పించింది. సాధారణ ఎన్నికల సమయంలో కేవలం పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు జరిపించి అసెంబ్లీని పక్కనపెట్టింది. మరోవైపు, కశ్మీర్‌లో అలజడులకు కారణమవుతోన్న వేర్పాటువాదుల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ, బ్యాంకుల్లో వారి అక్రమ లావాదేవీలపై కొరడా ఝలిపించింది. శుక్రవారం హఠాత్తుగా అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేయడంతోపాటు అదనపు బలగాలను మోహరించింది.

Image result for modi

ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబా, బీఆర్ సుబ్రమణ్యం, గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, గతంలో నిఘావ్యవస్థ అధిపతిగా పనిచేసి ప్రస్తుతం నాగాలాండ్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, మినహా మరో వ్యక్తికి తెలియకుండా వ్యూహాన్ని పక్కగా అమలు చేసింది. బిల్లు రూపకల్పనలో న్యాయ శాఖలో శాసన విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జి.నారాయణరాజు కూడా కీలక పాత్ర పోషించారు. నారాయణ రాజు 2015 అక్టోబరులో లెజిస్లేటివ్ సెక్రెటరీగా కేంద్రం నియమించింది. అంతకు ముందు న్యాయ శాఖలోని పలు విభాగాల్లో పనిచేసిన ఆయనకు కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఆర్టికల్ 370 రద్దుపై ఆయన కీలక సూచనలు, సలహాలు చేశారు.

Image result for modi

రెండోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్రంలోని సీనియర్ అధికారులకు రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన కీలక సమాచారం అందజేయాలని ఆదేశాలు అందాయి. దీంతో జమ్మూ కశ్మీర్ అంశంపై ప్రధాని కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం అధికార వర్గాల్లో జరిగింది. అయితే, దీనిని బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించారు. ప్రధాన వ్యూహానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వంలోని సీనియర్లు రహస్యంగా ఉంచారు.

Image result for modi

ఆర్టికల్ 370 రద్దుపై కీలక అధికారులతో చర్చ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి, జుమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన జగ్‌మోహన్ రాసిన ‘మై ఫ్రోజెన్ టర్బ్‌లెన్స్’ పుస్తకంలో దీని రద్దుకు సంబంధించిన కీలక మార్గం లభించింది. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్‌లో శాంతి భద్రతలు సమస్య తలెత్తకుండా హోం మంత్రి అమిత్ డైరెక్షన్‌లో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, పారామిలటరీ దళాలు సంయుక్తంగా పనిచేసి, బలగాలను మోహరించాయి. అలాగే, ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ బలగాలను వెనక్కు రప్పించడానికి అమెరికా ప్రయత్నించడంతో పాక్ నుంచి కొత్తగా ముప్పు ఉందనే సాకుతో లోయలో బలగాలను మోహరించి, అందరి దృష్టి మరల్చడానికి సాయపడింది. కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఆర్టికల్ 370 రద్దు బిల్లు రూపకల్పనలో ఎటువంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా బిల్లును జాగ్రత్తగా తయారు చేసింది డాక్టర్ జి. నారాయణరాజు గురించి తెలియగానే ఆయనకు అభినందనలు వస్తున్నాయి.కేంద్ర న్యాయశాఖలో న్యాయ వ్యవహారాల శాఖలో సెక్రటరిగా రాజు పనిచేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే ఎటువంటి బిల్లైనా సరే న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత నారాయణ రాజు మీదే ఉంటుంది. అయితే ఇక్కడ గమినించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రం ప్రవేశపెట్టే కొన్ని బిల్లులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ బిల్లులు దేశచరిత్రమే మార్చేసేవిగా ఉంటాయి. అందుకే ఈ బిల్లుపై ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించింది. అందులో కూడా నారాయణ రాజే కీలక పాత్ర పోషించారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

న్యాయ నిపుణులు న్యాయ సలహాలు ఇవ్వగలరే కాన డ్రాఫ్టింగ్ కు వచ్చే సరికి రాజు లాంటి నిపుణులే కీలక పాత్ర పోషిస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. న్యాయ నిపుణులు-నారాయణ రాజు జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసిన తర్వాత బిల్లును అధికార పార్టీ లోక్ సభలో ప్రవేశపెట్టి నెగ్గించుకున్నది. ఇదే బిల్లును అమిత్ షా రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370 ని తమిళనాడుకు చెందిన గోపాలస్వామి అయ్యంగార్ తయారు చేస్తే రద్దును నారాయణ రాజు డ్రాఫ్ట్ చేశారు.