టీడీపీ మాజీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ క‌న్నుమూత‌

181

ప్రముఖ సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 68 సంవ‌త్స‌రాలు..గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్‌ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్‌ 1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.కొంత‌కాలంగా వెన్నునొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు చెన్నై అపోలో ఆస్పత్రిలో డాక్టర్లు వైద్యం అందించారు.. అయినా ఆయ‌న కోలుకోలేదు….అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్‌లో చికిత్సపొందుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కొద్దిరోజుల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు…అప్ప‌టి నుంచి ఆయ‌న అపోలోలో చికిత్స తీసుకుంటున్నారు, అయితే నేడు ప‌రిస్దితి మ‌రింత విషమించింది… ఉద‌యం నుంచి ఆయ‌న ఐసీయూలోనే వెంటిలేట‌ర్ పై చికిత్స పొందారు.

Image result for ఎంపీ శివ‌ప్ర‌సాద్

శివప్రసాద్ 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

శివప్రసాద్ రాజకీయ రంగం మాత్రమే కాదు.. సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. విభజన, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో శివప్రసాద్ తన వేషాలతో వెరైటీగా నిరసన తెలియజేశారు. హోదా హామీని నెరవేర్చాలంటూ పార్లమెంట్ ముందు వెరైటీ వేషధారణల్లో ఆందోళనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయ‌న మ‌ర‌ణించారు అని తెలియ‌డంతో మాజీ సీఎం చంద్ర‌బాబు కూడా విచారం వ్య‌క్తం చేశారు, ఇటీవ‌ల కోడెల మ‌ర‌ణ వార్త మ‌రువ‌క ముందే ఇప్పుడు మాజీ ఎంపీ మ‌ర‌ణం తెలుగుదేశం పార్టీని మ‌రింత కుంగ‌తీసింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుందాం.